Breaking News

వీధి వ్యాపారుల రుణాలు మంజూరు చేయాలి

కామారెడ్డి, డిసెంబర్‌ 4

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వీధి వ్యాపారుల రుణాలు 10 వ తేదీలోగా వంద శాతం శాంక్షన్‌ చేయాలని జిల్లా కలెక్టరు డాక్టర్‌ ఎ.శరత్‌ మున్సిపల్‌ కమిషనర్‌ను ఆదేశించారు. శుకవారం తన ఛాంబర్‌లో జరిగిన వీధి వ్యాపారులు, స్వయం సహాయక సంఘాల రుణాలకు సంబంధించి అధికారులతో సమీక్షించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం లబ్దిదారులకు అందించే రుణాల లక్ష్యాన్ని వేగంగా పూర్తి చేయాలని, బ్యాంక్‌ అధికారుల సమన్వయంతో 15 వ తేదీలోగా స్వయం సహాయక సంఘాలకు బ్యాంక్‌ లింకేజీ రుణాలు అందించాలని తెలిపారు. మున్సిపల్‌ పరిథిలలో వీధి వ్యాపారుల రుణాలకు సంబంధించిన లక్ష్యాన్ని 10 తేదీలోగా పూర్తి చేయాలని మున్సిపల్‌ కమిషనర్‌లను ఆదేశించారు.

మూడు మున్సిపాలిటీలకు సంబంధించి 7703 వీధి వ్యాపారులకు గాను 5665 వీధి వ్యాపారులకు రుణ సౌకర్యం అందించి 74 శాతం సాధించడం జరిగిందని, జిల్లాలో 12,773 స్వయం సహా యక సంఘాలకు గాను 10,513 స్వయం సహాయక సంఘాలకు 388 కోట్ల లక్ష్యానికి 330 కోట్లు రుణ సౌకర్యం అందించడం జరిగిందని, మెప్మా సంఘాలకు సంబంధించి 410 సంఘాలకు 28 కోట్ల లక్ష్యానికి గాను 25 కోట్లు రుణం అందించి 90 శాతం లక్ష్యాన్ని సాధించడం జరిగిందని, మిగిలిన లక్ష్యాన్ని వేగంగా పూర్తి చేయాలని తెలిపారు.

సమీక్షా కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివద్ధి అధికారి చంద్రమోహన్‌ రెడ్డి, జిల్లా లీడ్‌ మేనేజరు రాజేందర్‌ రెడ్డి, కామారెడ్డి మున్సిపల్‌ కమిషనర్‌ దేవేందర్‌, ఎల్లారెడ్డి మున్సిపల్‌ కమిషనర్‌ మహ్మద్‌ ఖమర్‌, మెప్మా పిడి శ్రీధర్‌ రెడ్డి, ఎపిడి సుధీర్‌, డిపిఎంలు సుధాకర్‌ విలాస్‌ రావు, రవీందర్‌ రావు, వకుళ, జాను, మెప్మా రీసోర్స్‌ పర్సన్‌లు పాల్గొన్నారు.

Check Also

మానవత్వాన్ని చాటిన రక్తదాత లావణ్య

కామారెడ్డి, మే 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రం దేవునిపల్లి గ్రామానికి చెందిన ఈశ్వరయ్య ...

Comment on the article