Breaking News

Daily Archives: December 7, 2020

టోకెన్లు ఇచ్చి మొక్కజొన్నలు కొనుగోళ్లు చేపట్టాలి

కామారెడ్డి, డిసెంబర్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతు సమగ్ర సర్వే పోర్టల్‌లో మిస్‌ అయిన, నమోదు కాని రైతుల వివరాలను క్షేత్రస్థాయిలో విచారణ చేసి పోర్టల్‌లో నమోదు చేసి వారి నుండి కూడా మొక్క జొన్నలు కొనుగోలు చేయాలని జిల్లా కలెక్టర్‌ ఎ.శరత్‌ అధికారులను ఆదేశించారు. కామారెడ్డి కలెక్టరేట్‌ జనహిత భవనంలో సోమవారం జరిగిన వీడియో కాన్ఫరెన్సులో ఆయన అధికారులతో మాట్లాడారు. ఏ ఒక్క రైతుకు అన్యాయం జరగకుండా పోర్టల్‌లో నమోదు చేయాలని, ఏఈఓలు క్షేత్రస్థాయిలో ఉండి రైతులకు టోకెన్లు ...

Read More »

ఫోన్‌ ఇన్‌లో 25 ఫిర్యాదులు

కామారెడ్డి, డిసెంబర్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి కలెక్టరేట్‌ జనహితలో సోమవారం నిర్వహించిన ఫోన్‌ ఇన్‌ కార్యక్రమం ద్వారా జిల్లా అదనపు కలెక్టర్‌ పి.యాదిరెడ్డి 25 ఫిర్యాదులు స్వీకరించారు. కార్యక్రమంలో డిఆర్‌డిఓ చంద్రమోహన్‌ రెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Read More »

మొక్కజొన్నల కొనుగోలు వేగవంతం చేయాలి

కామరెడ్డి, డిసెంబర్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో మొక్కజొన్నల కొనుగోలు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌ అన్నారు. కామారెడ్డి జనహితలో సోమవారం జరిగిన వీడియో కాన్ఫరెన్సులో కలెక్టర్‌ మాట్లాడారు. రైతు సమగ్ర సర్వే పోర్టల్‌లో మొక్కజొన్న సాగు చేసినట్లు నమోదు చేసుకున్న రైతుల నుంచి మొక్కజొన్నలు కొనుగోలు చేయాలని సూచించారు. ఏఈఓలు క్షేత్రస్థాయిలో ఉండి రైతులకు టోకెన్లు ఇచ్చి మొక్కజొన్నలు కొనుగోళ్లు చేపట్టాలని కోరారు. ఈనెల 10 లోగా ధాన్యం కొనుగోలు పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. కొనుగోలు ...

Read More »

నల్ల చట్టాలు రద్దు అయ్యేవరకు ఉద్యమం

కామారెడ్డి, డిసెంబర్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా మంగళవారం భారత్‌ బంద్‌ కార్యక్రమంలో తాము పాల్గొని రైతులకు మద్దతుగా నిలుస్తామని ప్రభుత్వ విప్‌ గంప గోవర్దన్‌ అన్నారు. టేక్రియల్‌ బైపాస్‌ చౌరస్తా వద్ద ధర్నా, రాస్తారోకో చేపడతామన్నారు. ఇందుకోసం సోమవారం స్థలాన్ని పరిశీలించారు. ధర్నాలో ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొంటారని పేర్కొన్నారు. అదేవిధంగా ఉదయం 7.30 గంటలకు కామారెడ్డి పట్టణంలో ర్యాలీ, బంద్‌ చేపడతామన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నల్ల వ్యవసాయ ...

Read More »

బంద్‌ విజయవంతం చేయాలి

కామారెడ్డి, డిసెంబర్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సోమవారం కామారెడ్డి సిపిఎం పార్టీ జిల్లా కార్యాలయంలో సిపిఐ మరియు సిపిఎం పార్టీ వామపక్ష పార్టీలు కలిసి విలేకరులతో మాట్లాడారు. మంగళవారం భారత్‌ బందును విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి దశరథ్‌ మాట్లాడుతూ దేశంలో 35 రైతు సంఘాలు అట్లాగే ఇతర కమ్యూనిస్టు పార్టీలు అన్ని ప్రతిపక్ష పార్టీలు కలిసి వచ్చి విజయవంతం చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అట్లాగే సిపిఎం కామారెడ్డి జోన్‌ కమిటీ కార్యదర్శి ...

Read More »

డిఎస్‌పి నివాసంలో ఏసిబి సోదాలు

కామారెడ్డి, డిసెంబర్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి డీఎస్పీ లక్ష్మీనారాయణ నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. శనివారం హైదరాబాద్‌ తిరుమలగిరిలోని ఆయన నివాసంలో సోదాలు జరిపిన అధికారులు కొన్ని ఆస్తి పత్రాలతో పాటు బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. క్రికెట్‌ బెట్టింగ్‌ కేసులో లక్ష్మీనారాయణకు క్లీన్‌చిట్‌ వచ్చినప్పటికీ అక్రమ ఆస్తుల కోణంలో ఆదివారం ఉదయం 11 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. లక్ష్మీనారాయణ ఇంటితోపాటు ఆయనకు సంబంధించిన అన్ని అపార్ట్‌మెంట్లతో పాటు, ...

Read More »

త్రివిధ దళాల సేవలు మరువలేనివి

నిజామాబాద్‌, డిసెంబర్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దేశ రక్షణ కోసం తమ జీవితాలను త్యాగం చేస్తూ తమ భార్య పిల్లలను ఇంటి దగ్గరేవుంచి ఎక్కడో దేశ సరిహద్దులలో భారత దేశ రక్షణ కొరకు, భారత ప్రజల సుఖశాంతుల కొరకు పనిచేస్తున్న భారత త్రివిధ దళాల సేవలు మరవలేనివని, అందుకే వారి సంక్షేమానికి ప్రతి ఒక్క భారత పౌరుడు చేయూతనందిస్తూ వారికి సంఘీభావం తెలపడం అవసరమని జిల్లా కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి పిలుపునిచ్చారు. జిల్లా కలెక్టర్‌ కార్యాలయ ఆవరణలో సోమవారం సాయుద ...

Read More »

బాన్సువాడ ప్రజల కోసం…

బాన్సువాడ, డిసెంబర్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ పట్టణంలో ప్రజలకోసం ఆధునిక వైద్య సదుపాయాలతో నూతనంగా ఏర్పాటు చేసిన మంజీర మల్టిస్పెషాలిటి ఆసుపత్రిని ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా డీసీసీబీ చైర్మన్‌ పోచారం భాస్కర్‌ రెడ్డి ప్రారంబించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆసుపత్రిని అభివద్ధి చేస్తూనే ప్రజలకు అన్ని విధాలుగా సౌకర్యాలను అందిస్తూ అత్యవసర సమయంలో ప్రజలకు అందుబాటులో ఉంటూ ఆదుకోవాలని సూచించారు. అనంతరం ఆసుపత్రి సిబ్బంది శాలువాతో భాస్కర్‌ రెడ్డిని సన్మానించారు. కార్యక్రమంలో జిల్లా రైతు బంధు అధ్యక్షులు అంజిరెడ్డి, ...

Read More »

డూడూ బసవన్నలు…

కామారెడ్డి, డిసెంబర్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కొత్త వ్యవసాయ చట్టం విషయంలో 8న నిర్వహించబోయే భారత్‌ బంద్‌ విషయంలో తెలంగాణ ప్రభుత్వం కేవలం రాజకీయ దురుద్దేశంతోనే మొసలి కన్నీరు కారుస్తోందని భారతీయ జనతాపార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కాటిపల్లి వెంకటరమణారెడ్డి అన్నారు. తెలంగాణలో నిర్బంధ వ్యవసాయ చట్టం తెచ్చి చెప్పిన పంట వేస్తేనే రైతు బంధు ఇస్తామని బెదిరించి, సన్న రకం వడ్లు వేయించి, రోగాల పాలు అయిన తక్కువ దిగుబడి వచ్చిన పంటకు ఎక్కువ ధరకు కొనుగోలు చేయకుండా ...

Read More »

శిశు హత్య మహా పాపం

నిజామాబాద్‌, డిసెంబర్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శిశు హత్య మహా పాపం అని అడిషనల్‌ కలెక్టర్‌ లత అన్నారు. సోమవారం స్థానిక ప్రభుత్వ జనరల్‌ హాస్పిటల్‌లో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సర్కారీ వారి ఉయ్యాల కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా అడిషనల్‌ కలెక్టర్‌ మాట్లాడుతూ పిల్లల పెంపకం భారంగా ఉన్నవారు నాలలో గాని ముళ్లపొదల్లో గాని పారేయకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఉయ్యాలలో వేయాలని కోరారు. మానవత్వంతో ఆలోచించి పసి పాపలకు మరో ప్రపంచాన్ని చూపిద్దామన్నారు. మీకు ...

Read More »

ఇంకా విక్రయించకుంటే కొనుగోలు కేంద్రాలకు వెళ్ళండి…

నిజామాబాద్‌, డిసెంబర్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎవరైనా రైతుల వద్ద ఈ వాన కాలంలో పండించిన మక్కలు ఇంకా విక్రయించకుండా ఉంటే వాటిని కొనుగోలు కేంద్రాలలో అమ్ముకోవచ్చునని జిల్లా కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి ఒక ప్రకటనలో రైతులకు సూచించారు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు 3 వేల 340 మంది రైతుల నుండి తొమ్మిది వేల మెట్రిక్‌ టన్నుల మక్కలను జిల్లాలోని వ్యవసాయ మార్కెట్‌ కమిటీల ద్వారా సేకరించామని క్వింటాలుకు రూ.1850 మద్దతు ధర చెల్లిస్తున్నామని తెలిపారు. ఈ వాన కాలంలో ...

Read More »

మూడురోజుల పాటు ఇన్స్‌పెక్షన్‌ – రికార్డులు సిద్దం చేసుకోండి

నిజామాబాద్‌, డిసెంబర్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాల్లో ఉపాధి హామీ పథకం బాగా జరుగుతున్నందున జాతీయ ఉపాధి హామీ పథకం కేంద్ర ప్రభుత్వ జాయింట్‌ సెక్రటరీ జిల్లాలో మూడు రోజులపాటు పర్యటించనున్నట్లు జిల్లా కలెక్టర్‌ సి. నారాయణ రెడ్డి తెలిపారు. సోమవారం ఉపాధి హామీ పథకం అధికారులు ఎంపీడీవోలతో సెల్‌ కాన్షరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ నెల 9 నుండి 11 వరకు ఆయన బందం జిల్లాలో పర్యటించనున్నందున క్షేత్రస్థాయిలో జరుగుతున్న పనులను వారు ...

Read More »