Breaking News

Daily Archives: December 9, 2020

16న వేలం

నిజామాబాద్‌, డిసెంబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వ శాఖలకు చెందిన పలు పాత వాహనాలకు ఈనెల 16 న ఇ-వేలం నిర్వహిస్తున్నట్లు అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ పాత వాహనాల కెవైసి డాక్యుమెంట్లు, ఇఎండి డిపాజిట్‌ రుజువులతో ఆన్‌లైన్‌కు రిజిస్ట్రేషన్‌కు ఆఖరి డిసెంబర్‌ 10 అని ఆయన బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇ వేలం ఈనెల 16న నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆసక్తి ఉన్న వారు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Read More »

కల్కినగర్‌ నాయకులు బిజెపిలోకి

కామారెడ్డి, డిసెంబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కాటిపల్లి వెంకట రమణా రెడ్డి ఆధ్వర్యంలో కల్కి నగర్‌ 9 వ వార్డుకు సంబంధించిన అధికార తెరాస నాయకులు 21 మంది అధికార పార్టీకి రాజీనామా చేసి కాషాయ కండువా కప్పుకొని బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా వెంకట రమణా రెడ్డి మాట్లాడుతూ కామారెడ్డిలో అధికార పార్టీ ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతుందని, అభివద్ధి మరచి కబ్జాలకు పాల్పడుతున్నారని, వారితో తాళలేక అనేక మంది ఇబ్బంది ...

Read More »

గల్ఫ్‌ జెఏసి కార్యాచరణ

హైదరాబాద్‌, డిసెంబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అంతర్జాతీయ వలస కార్మికుల దినోత్సవం సందర్బంగా ”గల్ఫ్‌ భరోసా యాత్ర” చేయాలని గల్ఫ్‌ జెఏసి పిలుపు నిచ్చింది. 18వ తేదీన గ్రామాల నుండి మండల కేంద్రాలకు తరలి వచ్చి మోటార్‌ సైకిళ్ళపై ర్యాలీగా వెళ్లి తహశీల్దార్లకు వినతి పత్రాలు సమర్పించాలని ఒక ప్రకటనలో సంస్థ ప్రతినిదులు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే గల్ఫ్‌ వర్కర్స్‌ వెల్ఫేర్‌ బోర్డు ఏర్పాటు చేయాలని, గల్ఫ్‌ దేశాల నుండి వాపస్‌ వచ్చినవారు జీతం బకాయిలు మరియు ...

Read More »

దేశం కోసం ప్రాణాలు పణంగా పెట్టిన కుటుంబం

కామారెడ్డి, డిసెంబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీకి మాజీమంత్రి మాజీ మండలి ప్రతిపక్ష నేత మహ్మద్‌ అలీ షబ్బీర్‌ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆమె ఆయురారోగ్యాలతో వర్థిల్లాలని ఆకాంక్షించారు. సోనియా గాంధీ 74వ జన్మదిన వేడుకలు జరిగాయి. సోనియా జన్మదినాన్ని పురస్కరించుకుని నిరుపేదలకు రోడ్లపై, రైల్వేస్టేషన్లో నివసించే వారికి రోడ్ల పక్కన పడుకునే వారికి దాదాపు 500 మందికి దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా షబ్బీర్‌ ఆలీ ...

Read More »

కేంద్రంలో బీసీ బిల్లు ప్రవేశ పెట్టాలి

ఆర్మూర్‌, డిసెంబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పార్లమెంటులో బీసీ బిల్లు ప్రవేశ పెట్టి చట్ట సభల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు కొండవీటి శ్యామ్‌ ప్రసాద్‌ డిమాండ్‌ చేశారు. బుధవారం ఆర్మూర్‌ డివిజన్‌ అధ్యక్షుడు అబ్బగోని అనిల్‌ గౌడ్‌ అధ్య్షతన జరిగిన నిరసన దీక్ష, ధర్నాకు ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. ఇప్పటి వరకు ఉమ్మడి రాష్ట్రం నుంచి ఏ పార్టీ కూడ బీసీని ముఖ్యమంత్రి చేయలేదని ఆందోళన వ్యక్తం చేశారు. ...

Read More »

బి.ఇడి ఫలితాలు విడుదల

డిచ్‌పల్లి, డిసెంబర్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో గల బి.ఎడ్‌. కోర్సుకు చెందిన మొదటి, రెండవ, మూడవ సెమిస్టర్స్‌ బ్యాక్‌ లాగ్‌ పరీక్షలు మరియు నాల్గవ సెమిస్టర్‌ రెగ్యూలర్‌ / బ్యాక్‌ లాగ్‌ పరీక్షల ఫలితాలు బుధవారం ఉదయం రిజిస్ట్రార్‌ ఆచార్య నసీం తన చాంబర్‌ లో ఆవిష్కరించారు. కార్యక్రమంలో పరీక్షల నియంత్రణాధికారి డా. పాతనాగరాజు, అదనపు పరీక్షల నియంత్రణాధికారి జవేరియా ఉజ్మా, జూనియర్‌ అసిస్టెంట్‌ ఆసిఫ్‌ తదితరులు ఉన్నారు. మొదటి సెమిస్టర్‌ బ్యాక్‌ ...

Read More »

కాంట్రాక్టర్ల ఇష్టారాజ్యం

బీర్కూర్‌, డిసెంబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీర్కూర్‌ మండలం మంజీరా నది పరివాహక ప్రాంతంలో గత మూడు నెలలుగా నడుస్తున్న ఇసుక రవాణా పోచారం కాలనీ గుండా వెళ్లడం వలన కాలనీవాసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలుమార్లు కాంట్రాక్టర్లకు రాజకీయ నాయకులు విన్నవించినా పట్టించుకున్న పాపాన పోవడం లేదు. రోజుకు వందల సంఖ్యలో ఇసుక లారీలు వెళ్లడం వల్ల రోడ్డుపై నుండి దుమ్ము ధూళి తమ తినే ఆహార పదార్థాలపై పడుతుందని ఆ సమయంలో లోడింగ్‌ అన్‌ లోడింగ్‌ ఇసుక రవాణా ...

Read More »

మౌలిక సదుపాయాల కల్పనలో తెరాస ప్రభుత్వం విఫలమైంది

కామరెడ్డి, డిసెంబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మాచారెడ్డి మండలం పరీద్‌ పేటకు చెందిన 76 మంది యువకులకు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కాటిపల్లి వెంకట రమణా రెడ్డి కాషాయ కండువా కప్పి భారతీయ జనతాపార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్బంగా రమణారెడ్డి మాట్లాడుతూ బీజేపీ సిద్ధాంతాలకు ఆకర్షితులై, నరేంద్ర మోడీ అభివద్ధి కాంక్షకు మద్దతుగా, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ నాయకత్వంలో పని చేయటం కోసం యావత్‌ తెలంగాణ యువత ముందుకు వస్తుందని, కామారెడ్డిలో ఏ గ్రామంలో చూసిన యువత ...

Read More »

మధుయాష్కి ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో చీరల పంపిణీ

నిజామాబాద్‌, డిసెంబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ ప్రదాత, ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ పుట్టినరోజు సందర్భంగా బుధవారం మధుయాష్కీ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో జిల్లా కాంగ్రెస్‌ ఉపాధ్యక్షులు, మధుయాష్కీ ఫౌండేషన్‌ డైరెక్టర్‌ దయాకర్‌ గౌడ్‌ నేతత్వంలో జిల్లా కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షులు మానాల మోహన్‌ రెడ్డి, కేశ వేణు, తాహెర్‌బిన్‌ హందాన్‌ ముఖ్య అతిథులుగా హాజరై పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షులు మాట్లాడుతూ స్వాతంత్ర తెలంగాణ ...

Read More »