Breaking News

12న జాతీయ లోక్‌ అదాలత్‌

నిజామాబాద్‌, డిసెంబర్‌ 10

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈ నెల 12న రెండవ శనివారం జాతీయ లోక్‌ అదాలత్‌ నిర్వహిస్తున్నామని, అవకాశాన్ని కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా మరియు ప్రిన్సిపల్‌ జడ్జి సాయి రమాదేవి కోరారు. గురువారం జిల్లా న్యాయ సేవ సర్వీసెస్‌ భవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు.

సుప్రీం కోర్ట్‌, హైకోర్టు ఆదేశాలను అనుసరించి జాతీయ లోక్‌ అదాలత్‌ ఈ నెల 12న రెండవ శనివారం నిర్వహిస్తున్నామని, 11800 కేసులకు గాను లోక్‌ అదాలత్‌ ద్వారా రెండు వేలకు పైగా కేసులను పరిష్కరించడానికి గుర్తించామని సంబంధిత కక్షిదారులు హాజరై వారి కేసులను పరిష్కరించుకోవాలని ఆమె కోరారు. ఇప్పటికే 1228 కేసులకు నోటీసులు జారీ చేశామని మిగతా వారికి కూడా త్వరలో జారీ చేస్తామని వివరించారు.

కేసులు పరిష్కరించడానికి రెండు జిల్లాల స్థాయిలో 17 బ్రాంచ్‌లు ఏర్పాటు చేయడమైనదని, నిజామాబాద్‌ హెడ్‌ క్వార్టర్‌లో 4, కామారెడ్డి 3, బోధన్‌ 5, ఆర్మూర్‌ 2, బాన్సువాడ, ఎల్లారెడ్డి, బిచ్కుందలో 1 ఏర్పాటు చేయడమైనది. కావున పెండింగ్‌ ఉన్న కేసుల వారు హాజరై పరిష్కారం చేసుకోవాలని కోరారు.

లోక్‌ ఆదాలత్‌కు అందరూ సహకరించాలని సంబంధిత శాఖలను కోరారు. కరోనా వైరస్‌ నేపథ్యంలో కక్షిదారులు కేసుల పరిష్కారానికి ముందుకు రాకపోవడంతో చాలా కేసులు పరిష్కారం కాకుండా పోయాయని లోక్‌ అదాలత్‌ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయా కేసులకు సంబంధించిన ఇరువర్గాల కక్షిదారులు ముందుకు వచ్చి కేసులను పరిష్కరించుకొని సంతోషంగా వెళ్లాలని అన్నారు.

Check Also

కోవిడ్‌ పేషంట్‌ల‌తో మాట్లాడిన కలెక్టర్‌

నిజామాబాద్‌, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆరోగ్య కార్యకర్తలు మీ ఇంటికి ప్రతిరోజు వస్తున్నారా మీకు ...

Comment on the article