Breaking News

దొంగ వలన భయం…

కామారెడ్డి, డిసెంబర్‌ 12

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణ సర్కిల్‌ ఇన్స్పెక్టర్‌ మధుసూదన్‌ మీడియాతో మాట్లాడారు. కామారెడ్డి పట్టణంలో తరచూ దొంగతనాలు జరుగుతున్న నేపథ్యంలో ఇటీవల జరిగిన దొంగతనాలకు సంబంధించిన సీసీ ఫుటేజ్‌లు తీసుకోవడం జరిగిందని, అదేవిధంగా ఇటీవల జరిగిన దొంగతనాల్లో ఒకరిద్దరి జోక్యం ఉన్నట్టు తమకు సమాచారం ఉందన్నారు.

ఇకనుంచి కొత్త తరహాలో పెట్రోలింగ్‌ నిర్వహిస్తున్నామని, ఒక్కో ఏరియాకు ఒక్కో కానిస్టేబుల్‌, హోంగార్డు, ఆఫీసర్‌లను అలర్ట్‌ చేస్తున్నామన్నారు. సంబందిత ఏరియాపై ఇన్‌చార్జి ఆఫీసర్‌ నిరంతర నిఘా ఉంటుందని, తద్వారా దొంగతనాలు కొంతవరకు నివారించవచ్చని పేర్కొన్నారు.

కామారెడ్డి పట్టణ ప్రజలు శుభకార్యాలకు, విందులు, వినోదాలకు వెళ్లేటప్పుడు డబ్బు, ఆభరణాలు ఇంట్లో ఉంచి వెళ్లవద్దని సూచించారు. సాధ్యం కాకపోతే తమకు సమాచారం ఇవ్వాలని, అందుకు సంబంధించిన భద్రత ఏర్పాటు చేస్తామన్నారు. కాలనీల్లో ఎటువంటి చిన్న అనుమానాలు కలిగినా డయల్‌ 100 చేయాలన్నారు.

Check Also

మానవత్వాన్ని చాటిన రక్తదాత లావణ్య

కామారెడ్డి, మే 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రం దేవునిపల్లి గ్రామానికి చెందిన ఈశ్వరయ్య ...

Comment on the article