బోధన్, డిసెంబర్ 14
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దేశ రైతాంగాన్ని, వ్యవసాయాన్ని కార్పొరేట్ కంపనీలకు అప్పజెప్పే చట్టాలను, కేంద్ర విద్యుత్ సవరణ చట్టాన్ని రద్దుచేయాలంటూ సోమవారం నిజామాబాద్ జిల్లా బోధన్ కొత్త బస్టాండ్ ముందున్న రిలయన్స్ స్మార్ట్ మహల్ వద్ద వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు.
ఈ సందర్భంగా సీపీఐ (ఎం-ఎల్) న్యూ డెమోక్రసీ పార్టీ బోధన్ సబ్ డివిజన్ కార్యదర్శి బి మల్లేష్, సీపీఎం నాయకులు జే.శంకర్ గౌడ్, సీపీఐ (ఎం-ఎల్) న్యూ డెమోక్రసీ పార్టీ డివిజన్ కార్యదర్శి పి.వరదయ్య, సీపీఐ పార్టీ నియోజక వర్గ ఇన్చార్జి షేక్ బాబు మాట్లాడుతూ డిల్లీలో గత 18 రోజులుగా మంచు గడ్డ గట్టే చల్లటి చలి లో రైతులు రోడ్ల పైనే వంటలు చేసుకొని తింటూ, రోడ్ల మీదే పడుకుంటూ ప్రజా స్వామ్య పద్దతిలో తమ నిరసనలు తెలుపుతున్న మోడి మొండిగా వారి డిమాండ్లను తిరస్కరించడం సరికాదని మండి పడ్డారు.
నాటి జాతీయోద్యమంలో విదేశీ వస్తు బహిష్కరణ పోరాట స్ఫూర్తితో ఈరోజు దేశ రైతాంగాన్ని, వ్యవసాయాన్ని కార్పోరేట్ కంపనీల నుంచి కాపాడాలంటూ ఉద్యమించాల్సిన అవసరమెంతైన ఉందన్నారు. దేశ ప్రజలకు అన్నం పెడుతున్న రైతన్నల నోట్లో మట్టి గొట్టే రిలయన్స్ కంపెనీల ఉత్పత్తులను నిషేదించాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో ఏఐకేఏంఎస్ జిల్లా నాయకులు పడాల శంకర్, సీహెచ్ గంగయ్య, మైమూద్, ఐఎఫ్టీయూ నాయకులు కే. రవి, కె.వైద్యనాథ్, సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి ఏశాల గంగాధర్, మీరా ఇంకా ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.

Nizamabad News

Latest posts by Nizamabad News (see all)
- కరోన సమయంలో రక్తదానం చేయడం అభినందనీయం - April 15, 2021
- 15 మందికి పాజిటివ్ - April 15, 2021
- సుస్థిర రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ - April 14, 2021