కామారెడ్డిలో పాజిటివ్‌ శాతం తక్కువ

కామారెడ్డి, డిసెంబర్‌ 17

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసిఎంఆర్‌) రెండో విడత సర్వే ద్వారా కామారెడ్డి జిల్లాలోని బిక్కనూర్‌, నాగిరెడ్డిపేట మండలం ధర్మారెడ్డి గ్రామాల్లో ఏడు శాతం పాజిటివ్‌ ఉందని ఐసీఎంఆర్‌ సమన్వయకర్త దినేష్‌ కుమార్‌ తెలిపారు. నల్గొండ, జనగాం, కామారెడ్డి జిల్లాలో ఆగస్టు నెలలో రెండో విడత సర్వే నిర్వహించామని చెప్పారు. నల్గొండ, జనగామ జిల్లాల కన్నా కామారెడ్డిలో పాజిటివ్‌ శాతం తక్కువగా నమోదైందని పేర్కొన్నారు.

జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ. శరత్‌ ఆధ్వర్యంలో అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కరోనా నిర్ధారణ పరీక్షలు పెంచడం, పోలీస్‌, వైద్యశాఖ, ఇతర శాఖల సమన్వయంతో పనిచేసి కరోనా కేసులు తగ్గించారని చెప్పారు. కరోనా నివారణకు ప్రతి ఒక్కరు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. మాస్కులు ధరిస్తూ, వ్యాపార సంస్థల వద్ద భౌతిక దూరం పాటించాలని కోరారు. ప్రతి ఒక్కరు తప్పనిసరిగా శానిటైజర్‌ వాడాలని సూచించారు. డిసెంబర్‌ 21 నుంచి ఐసీఎంఆర్‌ ఆధ్వర్యంలో మూడో విడత సర్వే చేపడతామని పేర్కొన్నారు.

Check Also

సోడియం హైప్లో క్లోరైడ్‌ పిచ్చికారి

కామరెడ్డి, ఏప్రిల్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జ్లి కేంద్రంలో కరోనా కేసులు భారీ సంఖ్యలో ...

Comment on the article