Breaking News

ఉమ్మెడలో పోలీసు కళాజాత

నందిపేట్‌, డిసెంబర్‌ 19

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ కార్తికేయ ఆదేశాల మేరకు పోలీసు కళా జాతా కార్యక్రమం నందిపేట్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఉమ్మేడ గ్రామంలో నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజల కోసం పలుసూచనలు చేశారు. సెల్‌ ఫోన్‌ మేసేజ్‌ వస్తే మనం ప్రెస్‌ చేయ వద్దని, మన అకౌంట్లో డబ్బులు వాళ్ల అకౌంట్‌లో వెళ్లి పోతాయని అవగాహన కల్పించారు.

కావున ఎవ్వరు కూడా అలాంటి మేసేజ్‌లు ప్రెస్‌ చేయవద్దన్నారు. సైబర్‌ క్రైమ్‌కు లింక్‌ ఉన్న సంబంధం ఉంటుందని, బ్యాంక్‌ దగ్గర దొంగలు వుంటారని, మీ డబ్బులు జాగ్రత్తగా ఉంచుకోవాలని, కొంత మంది మాయ మాటలు చెప్పి మీ బంగారము మరియు డబ్బులు తీసుకొని పారి పోతారని జాగ్రత్తలు చెప్పారు. అదేవిధంగా చిన్న పిల్లలకు పెళ్లి చేయవద్దని, ప్రభుత్వం చెప్పినట్లు అమ్మాయికి 18 సమత్సరాలు మరియు అబ్బాయికి 21 సంవత్సరాలు నిండి ఉండాలని, చిన్న పిల్లలకు పెళ్లి చేస్తే చట్ట ప్రకారం నేరమని వివరించారు.

గ్రామాలలో బట్టలు అమ్మే వారు ఇంటికి వచ్చి రిక్కి చేసి వెళ్లి సమయం చూసి ఇంటి తాళాలు పగులగొట్టి ఇంట్లో ఉన్న డబ్బులు మరియు బంగారం దొంగిలించుకు పోతారన్నారు. గ్రామములో గల సమస్యల గురించి క్షుణ్ణంగా నాటక రూపంలో వివరించారు. కార్యక్రమంలో నందిపేట్‌ ఎస్‌ఐ, గ్రామ సర్పంచ్‌, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Check Also

సిఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కు పంపిణీ

నందిపేట్‌, జూలై 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట మండలం తొండకూరు గ్రామంలో ముఖ్యమంత్రి సహాయనిధి సీఎంఆర్‌ఎఫ్‌ ...

Comment on the article