జాగృతిని గ్రామస్థాయికి తీసుకెళ్ళాలి

కామారెడ్డి, డిసెంబర్‌ 20

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా తెలంగాణ జాగతి విస్తత స్థాయి సమావేశం ఆదివారం నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని కర్షక్‌ బీఈడి కళాశాలలో జాగతి జిల్లా అధ్యక్షులు చిట్టిమల్ల అనంత రాములు అధ్యక్షతన నిర్వహించారు. సమావేశానికి జిల్లా నలు మూలలనుండి తెలంగాణ జాగతి కార్యకర్తలు హాజరయ్యారు.

ఈ సందర్భంగా జాగతి అధ్యక్షులు మాట్లాడుతూ జాగతిచే నిర్వహించే విద్య, వైద్య, సాంస్కతిక, సాహిత్య, మహిళా సాధికారిక లాంటి కార్యక్రమాలను మండల, గ్రామ స్థాయిలో తీసుకెళ్లడానికి సభ్యులు కషిచేయాలని సూచించారు. నియోజకవర్గ, మండల, గ్రామ స్థాయిలో తెలంగాణ జాగతి కమిటీలను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ప్రతీ సభ్యుడు తెలంగాణ జాగతిలో స్వచ్చందంగా పనిచేయడానికి సిద్ధంగా ఉండాలని అన్నారు.

జిల్లాలోని ప్రతీ గ్రామంలో తెలంగాణ జాగతి ద్వారా ఒక స్వచ్చంద కార్యక్రమాన్ని నిర్వహించడానికి ప్రణాళికలు తయారు చేయడం జరుగుతుందని, దీనికి గాను జాగతి సభ్యులు సూచనలు, సలహాలు ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగా పలువురు జాగతి సభ్యత్వం స్వీకరించారు. స్వీకరించిన వారిలో సుమన్‌ యాదవ్‌, రాజ్యలక్ష్మి, బింగి లత, గడీల భైరయ్య, బింగి రవి ఉన్నారు.

 

Check Also

సోడియం హైప్లో క్లోరైడ్‌ పిచ్చికారి

కామరెడ్డి, ఏప్రిల్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జ్లి కేంద్రంలో కరోనా కేసులు భారీ సంఖ్యలో ...

Comment on the article