పశువులకు నట్టల నివారణ మాత్రలు

కామారెడ్డి, డిసెంబర్‌ 20

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆదివారం తిమ్మకపల్లి గ్రామంలో విజయడైరీ, జిల్లా పశువర్థక శాఖ మరియు రిలయన్స్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో గ్రామంలో నట్టల నివారణ మాత్రల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఇందులో అవులకు, గేదెలకు, ఎద్దులకు నట్టల నివారణ మాత్రలు వేశారు. అలాగే గోపాల మిత్ర బాబా గౌడ్‌ మాట్లాడుతూ పశువుల యాజమాన్యంపై అవగాహన కల్పించారు.

కార్యక్రమంలో సర్పంచ్‌ జ్ఞానేశ్వర్‌, డైరీ అధ్యక్షులు సాయిలు, ఉపాధ్యక్షులు భాస్కర్‌, రిలయన్స్‌ ఫౌండేషన్‌ సిఆర్‌పి వినాయక్‌, గోపాల మిత్ర బాబా గౌడ్‌, రైతులు, ప్రసాద్‌, కిషన్‌, గోపాల్‌ పాల్గొన్నారు. 114 పశువులకు మాత్రలు వేశారు.

Check Also

కామారెడ్డి వ్యాపారస్తుల‌కు ముఖ్య గమనిక

కామారెడ్డి, ఏప్రిల్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలో కరోనా వ్యాధి తీవ్రంగా వ్యాప్తి చెందుతున్న ...

Comment on the article