Breaking News

Daily Archives: December 21, 2020

హెడ్‌కానిస్టేబుల్‌కు ఏఎస్‌ఐగా ప్రమోషన్‌

కమ్మర్‌పల్లి, డిసెంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కమ్మర్‌ పల్లి పోలీస్‌ స్టేషన్‌లో హెడ్‌ కానిస్టేబుల్‌గా గత ఐదు సంవత్సరాలుగా అంకితభావంతో విధులు నిర్వహిస్తున్న జి.సుశీల్‌ కుమార్‌కి ఏ.ఎస్సైగా ప్రమోషన్‌ రావడం జరిగింది. అందుకుగాను కమ్మరపల్లి ఎస్‌ఐ, కార్యాలయ మరియు సిబ్బంది అతనికి అభినందనలు తెలిపారు.

Read More »

24 వరకు గిరి వికాసం దరఖాస్తులు స్వీకరించాలి

నిజామాబాద్‌, డిసెంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గిరి వికాసం పథకం కింద గిరిజనుల భూముల్లో విద్యుత్తు, బోరు, మోటార్‌ సదుపాయాలకు ఈనెల 24 లోగా దరఖాస్తులు స్వీకరించాలని జిల్లా కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి ఎంపీడీవోలు, సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం సెల్‌ కాన్ఫరెన్సు ద్వారా అదనపు కలెక్టర్‌, ఉద్యానవన శాఖ ఉపసంచాలకులు, డిఆర్‌డిఓ, ఎంపీడీవోలు, ఆర్డీవోలు ఏపీఓలతో గిరి వికాసం పథకంపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ పథకం కింద గిరిజనుల పడావ్‌ ఉన్న కనీసం రెండున్నర ...

Read More »

హ‌ద్దుల వ‌ద్ద దిమ్మెలు ఏర్పాటు చేయాలి

కామారెడ్డి, డిసెంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణ ప్రభుత్వ డిగ్రీ కళాశాల చుట్టూ గుర్తించిన హద్దుల వద్ద దిమ్మెలు ఏర్పాటు చేయాలని కాలేజీ ప్రిన్సిపాల్‌ను జిల్లా కలెక్టరు డాక్టర్‌ ఎ.శరత్‌ ఆదేశించారు. సోమవారం తన ఛాంబర్‌లో కాలేజీకి సంబంధించిన భూముల హద్దులను ఆయన పరిశీలించారు. ఉమ్మడి జిల్లాలో గత 2016 సంవత్సరంలో జిల్లా సర్వేల్యాండ్‌ రికార్డు శాఖ సర్వే చేయడం జరిగిందని, తిరిగి 2017 సంవత్సరంలో కూడా హద్దులు ఏర్పాటు చేయడం జరిగిందని, తిరిగి అదే రిపోర్టును జిల్లా ...

Read More »

జాగృతి నాయకుల రక్తదానం

గాంధారి, డిసెంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విద్యా, వైద్య, ఆరోగ్యంతో పాటు స్వచ్చంద సేవా కార్యక్రమాల్లో తెలంగాణ జాగతి సభ్యులు ముందుంటారని మరోసారి నిరూపించారు. రక్త దానం చేసి ఆదుకున్నారు. వివరాల్లోకి వెళితే కామారెడ్డి మండలం లింగాపూర్‌ గ్రామానికి చెందిన మంచాల రాములు కాలికి ఆపరేషన్‌ నిమిత్తం 0 పాజిటివ్‌ రక్తం అవసరం ఉందని సమాచారం అందుకున్న జాగతి జిల్లా పిఆర్‌ఓ ఆవుసుల రాజు జాగతి సభ్యులు స్వామి గౌడ్‌, భైరయ్య, రవి, లత రణదీప్‌లు ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. ...

Read More »

వంతెనలు, రహదారుల పనులు వేగవంతం చేయాలి

నిజామాబాద్‌, డిసెంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్‌ అండ్‌ బి వంతెనలు, జాతీయ రహదారుల భూసేకరణ పూర్తి చేయడంతోపాటు అందుకు సంబంధించిన ఇతర కార్యక్రమాలు త్వరగా పూర్తి చేయటానికి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్‌ ఛాంబర్‌లో నేషనల్‌ హైవే మరియు ఆర్‌అండ్‌బిపై రివ్యూ నిర్వహించారు. నేషనల్‌ హైవేలో మొత్తం కేసెస్‌ 3 ఉండగా అందులో ఒక కేసెస్‌ డిస్పోజ్డ్‌ అయినదని మరో రెండు కేసెస్‌ పెండింగ్‌లో ఉన్నాయన్నారు. మిగితావి కూడా ...

Read More »

విద్యార్థుల ఇంటికి మేయర్‌ – ఆన్‌లైన్‌ తరగతుల పరిశీలన

నిజామాబాద్‌, డిసెంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నగరంలోని నాగారంలోని ఖలీల్‌వాడి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థి మాస్టర్‌ రాజేష్‌, 6వ తరగతి చదువుతున్న కుమారి రాగిణీ ప్రభుత్వం అందిస్తున్న ఆన్‌ లైన్‌ విద్యను ఏవిధంగా చదువుతున్నారో అని నగర మేయర్‌ దండు నీతూ కిరణ్‌ విద్యార్థి ఇంటి వద్దకు వెళ్లి తల్లిదండ్రులను అడిగి తెలుసుకున్నారు. ఆన్‌లైన్‌ తరగతుల ద్వారా పిల్లలు ఏవిధంగా చదువుతున్నారో అని ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. పోటీ ప్రపంచంలో ముందుకు వెళ్లాలంటే విద్యే ...

Read More »

జీవనభృతి కోసం కార్మికుల ధర్నా

బోధన్‌, డిసెంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఏలాంటి ఆంక్షలు లేకుండా బీడీలు చేసే కార్మికులందరికి 2016 రూపాయల జీవన భతి ఇవ్వాలని తెలంగాణ ప్రగతి శీల బీడీ వర్కర్స్‌ యూనియన్‌ (ఐఎఫ్‌టీయూ) జిల్లా కార్యదర్శి బి మల్లేష్‌ డిమాండ్‌ చేశారు. సోమవారం నిజామాబాద్‌ జిల్లా బోధన్‌ పట్టణంలో తెలంగాణ ప్రగతి శీల బీడీ వర్కర్స్‌ యూనియన్‌ (ఐఎఫ్‌టీయూ) ఆధ్వర్యంలో ఆర్డీవో కార్యాలయం ముందు బీడీ కార్మికులతో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బి.మల్లేష్‌ మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో బీడీలు చేసే ...

Read More »

చిన్ని కృష్ణుడిని ఆదర్శంగా తీసుకోవాలి

నిజామాబాద్‌, డిసెంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతు నేస్తం అవార్డును పొందిన చిన్ని కష్ణుడును జిల్లా కలెక్టర్‌ సి. నారాయణ రెడ్డి సన్మానించారు. జక్రాన్‌పల్లి మండలం చింతలూరు గ్రామానికి చెందిన నాగుల చిన్న గంగారం అలియాస్‌ చిన్ని కష్ణుడు సాంప్రదాయ పద్ధతులలో, సేంద్రియ ఎరువులతో మాత్రమే వ్యవసాయం చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు, ప్రశంసలు పొందుతూ 2020-21 సంవత్సరానికి ఉత్తమ రైతుగా రైతు నేస్తం అవార్డుకు ఎంపికై భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా ఈనెల 16న అవార్డును అందుకున్నాడు. ...

Read More »

మంగళవారం గాంధారికి మంత్రి రాక

గాంధారి, డిసెంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గాంధారి మండలానికి రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ మంగళవారం పర్యటించనున్నట్లు మండల తెరాస నాయకులు తెలిపారు. పలు అభివద్ధి కార్యక్రమాలలో పాల్గొనడంతో పాటు గిరిజన గురుకుల పాఠశాల ఆవరణలో జరిగే సభలో పాల్గొంటారని అన్నారు. మండల కేంద్రాలోని కేజీబీవీ ఆవరణలో నూతనంగా కోటి యాభై నాలుగు లక్షలతో నిర్మించిన నూతన కళాశాల భవనాన్ని ప్రారంభిస్తారు. అనంతరం మండలంలో నిర్మించే ఏకలవ్య మోడల్‌ స్కూల్‌ అదనపు గదుల నిర్మాణానికి శంకుస్థాపన ...

Read More »

క్రిస్టమస్‌ కిట్ల పంపిణి

గాంధారి, డిసెంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సబ్బండ వర్గాల సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ ముఖ్య ద్యేయమని గాంధారి జడ్పీటీసీ శంకర్‌ నాయక్‌, ఎంపీపీ రాదా బలరాం నాయక్‌ అన్నారు. సోమవారం గాంధారి మండలంలో సుమారు 150 క్రిస్టమస్‌ కిట్లను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్బంగా స్థానికంగా గల రెండు చర్చిలలో పర్యటించి కిట్లను అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ ఏర్పడ్డ తర్వాత అన్ని వర్గాల సంక్షేమం కొరకు ముఖ్యమంత్రి కెసిఆర్‌ కషిచేస్తున్నారని అన్నారు. గుర్జాల్‌కు 20, గండివేట్‌కు ...

Read More »

ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ పరీక్షలకు ఉచిత శిక్షణ

హైదరాబాద్‌, డిసెంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ బీ.సీ స్టడీ సర్కిల్‌ నందు ఎస్‌ఐ మరియు పోలీస్‌ కానిస్టేబుల్‌ ప్రిలిమ్స్‌ పరీక్షల కొరకు ఉచిత ఆన్‌ లైన్‌ కోర్సు శిక్షణకు అర్హులైన బీసీ, ఎస్సీ, ఎస్టీ, అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు స్టడీ సర్కిల్‌ డైరెక్టర్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దరఖాస్తు చేయటానికి టిఎస్‌ బిసి స్టడీ సర్కిల్‌ వెబ్‌సైట్‌ నందు దరఖాస్తు ఫారం, పూర్తి నోటిఫికేషన్‌ ఈనెల 24 నుండి ఆన్‌లైన్‌ ద్వారా చివరి 31వ తేదీ లోపు ...

Read More »

ఆర్‌టిసిపై కేంద్ర ప్రభుత్వ వివక్ష తగదు…

నిజామాబాద్‌, డిసెంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజా రవాణా రక్షించడానికి తెలంగాణలో ఆర్‌టిసి సంస్థపై వివక్షను తొలగించి రైల్వేలాగా డీజిల్‌పై 4 శాతం పన్ను విధించాలని ఎం.వి. యాక్టులో ఆర్‌టిసి రక్షణగా మార్పులు తేవాలని ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి ఓమయ్య కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సోమవారం జిల్లా కలెక్టర్‌కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఒకే దేశం ఒకే పన్ను అన్న కేంద్ర ప్రభుత్వం రైల్వేలకు డీజిల్‌పై 4 శాతం ...

Read More »

యువత స్వయం ఉపాధికి సబ్సిడీ రుణాలు

నిజామాబాద్‌, డిసెంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : షెడ్యూల్‌ కులాల యువతీ, యువకులకు స్వయం ఉపాధి కల్పించేందుకు సబ్సిడి రుణాలు అందిస్తున్నట్టు జిల్లా షెడ్యూల్డ్‌ కులాల సేవా సహకార అభివద్ధి సంస్థ ఈడి ఇ.రాజేశ్వరి ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో 2020-21 సంవత్సరానికి గాను 637 మంది లబ్దిదారులకు రూ. 2735.55 లక్షల బ్యాంకు రుణాలు అందించాలనే లక్ష్యం పెట్టుకున్నామని తెలిపారు. ఒక్కో అభ్యర్థికి రూ.1 లక్ష వరకు 80 శాతం సబ్సిడి, రూ.2 లక్షలకు 70 శాతం సబ్సిడి ఆపై ...

Read More »