చిన్ని కృష్ణుడిని ఆదర్శంగా తీసుకోవాలి

నిజామాబాద్‌, డిసెంబర్‌ 21

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతు నేస్తం అవార్డును పొందిన చిన్ని కష్ణుడును జిల్లా కలెక్టర్‌ సి. నారాయణ రెడ్డి సన్మానించారు. జక్రాన్‌పల్లి మండలం చింతలూరు గ్రామానికి చెందిన నాగుల చిన్న గంగారం అలియాస్‌ చిన్ని కష్ణుడు సాంప్రదాయ పద్ధతులలో, సేంద్రియ ఎరువులతో మాత్రమే వ్యవసాయం చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు, ప్రశంసలు పొందుతూ 2020-21 సంవత్సరానికి ఉత్తమ రైతుగా రైతు నేస్తం అవార్డుకు ఎంపికై భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా ఈనెల 16న అవార్డును అందుకున్నాడు.

ఈ సందర్భంగా ఆయన జిల్లా వ్యవసాయ అధికారి ద్వారా కలెక్టర్‌ను సోమవారం కలెక్టర్‌ చాంబర్‌లో కలుసుకున్నారు. రసాయన ఎరువులు వాడకుండా సాంప్రదాయ పద్ధతిలో ఆరోగ్యకరమైన పంటలు సాగు చేస్తూ ఇతర రైతులకు ఆదర్శంగా నిలిచిన చిన్ని కష్ణుడును ఈ సందర్భంగా కలెక్టర్‌ సన్మానించి ప్రశంసించారు. ఈ సందర్బంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రకతి వ్యవసాయం చేసి రైతులకు ఆదర్శంగా నిలిచిన మన జిల్లా వాసి చిన్ని కష్ణుడు రైతు నేస్తం అవార్డు అందుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు.

రైతులు చిన్ని కష్ణుడుని ఆదర్శంగా తీసుకొని ఆయన తోవలో అందరూ రైతులు ప్రకతి వ్యవసాయం చేసి అట్టి ఆహారాన్ని పదిమందికి అందించి ఆరోగ్యంగా ఉండాలని తెలిపారు. చిన్ని కష్ణుడు అవార్డుకు ఎంపిక కావడం తనకు చాలా ఆనందంగా ఉందన్నారు.

మన జిల్లా కలెక్టర్‌ సన్మానం చేయడం, తన ప్రశంసలు పొందడం ద్వారా రైతులకు ఇంకా ఎక్కువ సేవలు అందించాల్సిన బాధ్యత పెరిగిందని చిన్న గంగారం తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌, జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్‌, లీడ్‌ బ్యాంక్‌ మేనేజర్‌ జయ సంతోషి, రైతులు తదితరులు పాల్గొన్నారు.

Check Also

ఎన్నికలు వాయిదా

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కోవిడ్‌ 19 మహమ్మారి జిల్లాలో విస్తరిస్తున్న కారణంగా ఈ ...

Comment on the article