Breaking News

Daily Archives: December 22, 2020

సేవాలాల్‌ మహారాజ్‌ ఆదేశాలు అనుసరణీయం

ఇందల్వాయి, డిసెంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సేవాలాల్‌ మహారాజ్‌ ఆదేశాలు పాటించడమే మనందరికీ మంచిదని అదేవిధంగా పోడు భూముల సమస్య పరిష్కరించడానికి ముఖ్యమంత్రి ఆలోచన చేస్తున్నారని రాష్ట్ర దేవాదాయ శాఖ మాత్యులు ఎన్‌.ఇంద్రకరణ్‌ రెడ్డి తెలిపారు. ఇందల్వాయి మండలం దేవి తండాలో దేవాదాయ శాఖ మంజూరు చేసిన 50 లక్షల రూపాయలతో నిర్మించిన జగదాంబ మాత దేవాలయం, సేవాలాల్‌ మహారాజ్‌ దేవాలయం, రాజగోపురం ప్రతిష్టాపన ప్రారంభోత్సవ కార్యక్రమాలకు మంగళవారం రాష్ట్ర ఆర్‌అండ్‌బి శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ ...

Read More »

అంబాని, అదానిల దిష్టి బొమ్మల దగ్ధం

బోధన్‌, డిసెంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కేంద్ర ప్రభుత్వం తీసుకోచ్చిన రైతు వ్యతిరేక మూడు చట్టాలను, కేంద్ర విద్యుత్‌ సవరణ బిల్లును రద్దుచేయాలంటూ, డిల్లీలో రైతాంగం చేస్తున్న పోరాటం పట్ల మోడి, షాల నిర్లక్ష్య విధానాలను నిరసిస్తూ మంగళవారం దేశ వ్యాప్తంగా మోడీ, అనిల్‌ అంబాని, అదానిల దిష్టిబొమ్మలను దహనం చేయాలని ఏఐకేఎస్‌సిసి పిలుపు నిచ్చింది. ఈ మేరకు బోధన్‌ పట్టణంలో అంబేడ్కర్‌ చౌరస్తాలో మోడి, అనిల్‌ అంభాని, అదానిల ధిష్టి బొమ్మలను దహనం చేశారు. కార్యక్రమంలో సీపీఐ (ఎంఎల్‌) ...

Read More »

బి.ఎడ్‌. పరీక్షలు ప్రారంభం

డిచ్‌పల్లి, డిసెంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో అన్ని అనుబంధ కళాశాలలో బి.ఎడ్‌. కోర్సుకు సంబంధించిన రెగ్యూలర్‌ మరియు బ్యాక్‌ లాగ్‌ పరీక్షలు మంగళవారం ప్రారంభం అయ్యాయి. ఉదయం జరిగిన బి.ఎడ్‌. రెండవ సెమిస్టర్‌ రెగ్యూలర్‌ పరీక్షలు 1307 మంది నమోదు చేసుకోగా 1253 హాజరు, 54 గైర్హాజరు అయ్యారు. మధ్యాహ్నం జరిగిన బి.ఎడ్‌. మొదటి సెమిస్టర్‌ బ్యాక్‌ లాగ్‌ పరీక్షలు 210 మంది నమోదు చేసుకోగా 185 హాజరు, 25 గైర్హాజరు అయినట్టు పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్‌ ...

Read More »

స్ట్రెయిన్‌ వైరస్‌ లక్షణాలు ఇవే

నిజామాబాద్‌, డిసెంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : యూరప్‌ దేశాలను ఇప్పుడు కొత్త రకం స్ట్రెయిన్‌ వణికిస్తోంది. కొత్త రకం వైరస్‌ చాలా వేగంగా వ్యాప్తి చెందుతోంది. కొత్త రకం కరోనా ఇప్పుడు బ్రిటన్‌ని కలవరపాటుకి గురిచేస్తోంది. బ్రిటన్‌లో 1000 కి పైగా కేసుల్లో కొత్త రకం కరోనా వైరస్‌ కొనుగొబడిందని అక్కడి నిపుణులు చెబుతున్నారు. వేగంగా వైరస్‌ కేసులు పెరిగిపోతుండటంతో బ్రిటన్‌లో టైర్‌-4 లాక్‌ డౌన్‌ విధించింది బోరిస్‌ ప్రభుత్వం. ఇందులో భాగంగా లండన్‌, సౌత్‌ ఈస్ట్‌ ఇంగ్లాండ్‌లో కఠినమైన ...

Read More »

రోడ్డు ప్రమాద బాధితుడికి ఉపాధ్యాయుని రక్తదానం

కామారెడ్డి, డిసెంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రైవేటు వైద్యశాలలో రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ బాధితుడికి బి పాజిటివ్‌ రక్తం అవసరం కావడంతో వారి బంధువులు రక్తదాతల సమూహ నిర్వాహకుడు బాలును సంప్రదించారు. వారికి కావలసిన రక్తాన్ని పట్టణానికి చెందిన సంగోజివాడిలో విధులు నిర్వహిస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడు జమీల్‌ హైమద్‌ సహకారంతో వీ.టి. ఠాకూర్‌ బ్లడ్‌ బ్యాంకులో రక్తదానం చేసి ప్రాణాలు కాపాడారు. ఈ సందర్భంగా బాలు మాట్లాడుతూ గతంలో చాలా సార్లు అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారికి ...

Read More »