Breaking News

రోడ్డు ప్రమాద బాధితుడికి ఉపాధ్యాయుని రక్తదానం

కామారెడ్డి, డిసెంబర్‌ 22

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రైవేటు వైద్యశాలలో రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ బాధితుడికి బి పాజిటివ్‌ రక్తం అవసరం కావడంతో వారి బంధువులు రక్తదాతల సమూహ నిర్వాహకుడు బాలును సంప్రదించారు. వారికి కావలసిన రక్తాన్ని పట్టణానికి చెందిన సంగోజివాడిలో విధులు నిర్వహిస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడు జమీల్‌ హైమద్‌ సహకారంతో వీ.టి. ఠాకూర్‌ బ్లడ్‌ బ్యాంకులో రక్తదానం చేసి ప్రాణాలు కాపాడారు.

ఈ సందర్భంగా బాలు మాట్లాడుతూ గతంలో చాలా సార్లు అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారికి రక్తదానం చేయడం జరిగిందని, కరోణ వ్యాధితో ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తికి ప్లాస్మాను కూడా దానం చేసిన ఉపాధ్యాయుడిని అభినందించారు.

ప్రస్తుత తరుణంలో రక్త నిల్వలు లేకపోవడం వలన అత్యవసర పరిస్థితుల్లో ఉన్న వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని రాష్ట్రవ్యాప్తంగా తలసేమియా వ్యాధితో బాధపడే పిల్లలకు రక్తం దొరకక ప్రాణాపాయ స్థితిలో ఉన్నారని, కావున రక్తదాతలు స్పందించి రక్తదానం చేయడానికి ముందుకు రావాలని సూచించారు. కార్యక్రమంలో టెక్నీషియన్‌ చందన్‌, శ్రీనివాస్‌, రాజు తదితరులున్నారు.

Check Also

మానవత్వాన్ని చాటిన రక్తదాత లావణ్య

కామారెడ్డి, మే 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రం దేవునిపల్లి గ్రామానికి చెందిన ఈశ్వరయ్య ...

Comment on the article