Breaking News

Daily Archives: December 23, 2020

అక్రమంగా తరలిస్తున్న ప్రజాపంపిణీ బియ్యం పట్టివేత

నిజామాబాద్‌, డిసెంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజాపంపిణీ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న వాహనాన్ని సీజ్‌ చేసి సంబంధిత యజమానిపై కేసు నమోదు చేయడం జరిగిందని అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. బుధవారం వాహనం నెంబర్‌. 4782 లో ప్రజా పంపిణీకి సంబంధించిన బియ్యాన్ని బోధన్‌ మండల కేంద్రంలో గల సూర్య ఆగ్రో ఇండస్ట్రీస్‌ రైసుమిల్లుకు తరలిస్తుండగా అధికారులు గుర్తించి లారీని సీజ్‌ చేసినట్లు ఆయన తెలిపారు. బియ్యానికి సంబంధించి లారీ డ్రైవర్‌ గాని, యజమాని గాని ఎటువంటి ...

Read More »

25 శాతం తగ్గకుండా హాజరయ్యే విధంగా చూడాలి

కామారెడ్డి, డిసెంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉపాధి హామీ పనులకు కూలీలు 25 శాతం తగ్గకుండా హాజరయ్యే విధంగా చూడాలని జిల్లా కలెక్టరు డాక్టర్‌ ఎ.శరత్‌ ఎండిఓ, ఎపిడి, ఎపిఓలను ఆదేశించారు బుధవారం జనహితలో గాంధారి, సదాశివనగర్‌, కామారెడ్డి, రామారెడ్డి, రాజంపేట బీబీపేట, బికనూర్‌, దోమకొండ, మాచారెడ్డి, తాడ్వాయి, లింగంపేట మండలాలలో జరుగుతున్న ఉపాధి హమీ, పల్లెప్రగతి పనులను సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామాలలో కొత్త పనులను శ్రమశక్తి సంఘాల సమక్షంలో గుర్తించాలని, వారితో అండర్‌ టేకింగ్‌ ...

Read More »

29న బ్యాంక్‌ లోక్‌ అదాలత్‌

నిజామాబాద్‌, డిసెంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతు బంధు, రైతులకు వ్యవసాయ పంట రుణాలు రెన్యువల్‌పై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. బుదవారం వీడియో కాన్ఫరెన్సు హాల్‌ నుండి బ్యాంకర్స్‌, మండల స్థాయి ఏఈఓ, ఎంఏఓ అధికారులతో జిల్లా కలెక్టర్‌ రైతు బంధు, వ్యవసాయ రుణాల రెన్యువల్‌పై వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఎస్‌బిఐ బ్యాంకు వారు ఈ నెల 29న లోక్‌ అదాలత్‌ ఏర్పాటు చేస్తున్నారని, వ్యవసాయదారులు ...

Read More »

5 నుంచి పిజి పరీక్షలు

డిచ్‌పల్లి, డిసెంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో అన్ని అనుబంధ కళాశాలలో పీజీ కోర్సులకు సంబంధించిన నాల్గవ సెమిస్టర్‌ రెగ్యూలర్‌, రెండవ సెమిస్టర్‌ రెగ్యూలర్‌ / బ్యాక్‌లాగ్‌ మరియు మొదటి సెమిస్టర్‌ బ్యాక్‌ లాగ్‌ పరీక్షలు జనవరి 5 వ తేదీ నుంచి ప్రారంభం అవుతున్నాయి. అందుకోసం విశ్వవిద్యాలయ కళాశాల ప్రధానాచార్యులు డా. వాసం చంద్రశేఖర్‌ విభాగాధిపతులతో మంగళవారం ఉదయం పరిపాలనా భవనంలోని ఎగ్జిక్యూటీవ్‌ సమావేశ మందిరంలో సమావేశం నిర్వహించి, పరీక్షల నిర్వహణకు సంబంధించిన అంశాలపై చర్చించారు. ఎం.సి.ఎ., ...

Read More »

పనులు స్పీడ్‌ అప్‌ కావాలి

ఆర్మూర్‌, డిసెంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్ల నిర్మాణం, ఆర్‌అండ్‌బి వంతెనల పనులు మరింత వేగంగా పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ సి నారాయణ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం ఆర్మూర్‌ మండలం అంకాపూర్‌, ఆర్మూర్‌, పిప్రి గ్రామాలలో జరుగుతున్న హరితహారం మొక్కల పెంపకం, పట్టణ ప్రగతి పనులు, డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్ల నిర్మాణం పనులను పరిశీలించారు. పనులు వేగవంతం చేయాలని మే నెల వరకు పూర్తిచేసే విధంగా అధికారులు ...

Read More »

ఇదే చివరి గడువు

నిజామాబాద్‌, డిసెంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం డిగ్రీ (బీ.ఏ/బీ.కాం/బీ.ఎస్సీ), పీ.జీ (ఎం.ఎ, ఎం.కాం, ఎంఎస్‌సి, ఎంబిఎ) కోర్సుల్లో చేరడానికి డిసెంబర్‌ 31 వరకు పొడిగించినట్లు ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా రీజినల్‌ కో-ఆర్డినేటర్‌ డా.యన్‌.అంబర్‌ సింగ్‌ తెలిపారు. ఆయా కోర్సుల్లో చేరడానికి, విద్యార్హతలు, ఫీజు తదితర వివరాలను ఓపెన్‌ యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో పొందుపర్చినట్లు వెల్లడించారు. ఇప్పటికే అడ్మిషన్‌ పొంది ఉండి వివిధ కారణాలతో సకాలంలో ట్యూషన్‌ ఫీ చెల్లించలేకపోయిన డిగ్రీ కోర్సు ద్వితీయ, తతీయ సంవత్సర ...

Read More »

కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ

కామారెడ్డి, డిసెంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి నియోజికవర్గంలోని కామారెడ్డి, మాచారెడ్డి, దోమకొండ, బీబీపేట్‌, భిక్కనూర్‌, రామారెడ్డి, రాజంపేట మండలాలకు చెందిన 261 మంది లబ్ధిదారులకు 2 కోట్ల 61 లక్షల రూపాయల కల్యాణలక్ష్మి చెక్కులను ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజికవర్గంలో ఇప్పటి వరకు 32 కోట్ల 61 లక్షల 50 వేల రూపాయల కల్యాణలక్ష్మి, షాదిముభారక్‌ చెక్కులు పంపిణీ చేసినట్టు ఆయన ...

Read More »

అంగన్‌వాడి భవనం ప్రారంభం

బాన్సువాడ, డిసెంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ మండలం, కొయ్యగుట్ట గ్రామంలో నూతనంగా నిర్మించిన అంగన్‌వాడి భవనాన్ని ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా డీసీసీబీ చైర్మన్‌ పోచారం భాస్కర్‌ రెడ్డి ప్రారంభించారు. బుధవారం కొయ్యగుట్ట గ్రామంలో రూపాయలు 6.50 లక్షలతో నూతనంగా నిర్మించిన అంగన్‌వాడి భవనాన్ని సర్పంచ్‌ కోమలిభాయ్‌, ఎంపీపీ దొడ్ల నీరజ వెంకట రామ్‌ రెడ్డితో కలిసి ప్రారంభించారు. అనంతరం భవనాన్ని పరిశీలించిన భాస్కర్‌ రెడ్డి పిల్లలకు అవసరమైన అన్ని వసతులను సమకూర్చాలని సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా ...

Read More »