కిసాన్‌ సమ్మాన్‌ యోజనలో లక్ష 50 వేల మంది కామారెడ్డి రైతులకు లబ్ది

కామారెడ్డి, డిసెంబర్‌ 24

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శుక్రవారం మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌ పేయి జయంతి (సుపరిపాలన దినోత్సవం) సందర్భంగా భారత ప్రధాని నరేంద్రమోదీ చేతుల మీదుగా యసంగి పంట కోసం 9 కోట్ల మంది రైతులకు కిసాన్‌ సమ్మన్‌ యోజన కింద 18 వేల కోట్ల రూపాయలు నేరుగా జమ చేయనున్నారని, అందులో భాగంగా కామారెడ్డి జిల్లాలో దాదాపు ఒక లక్ష యాబై ఒక్క వేల మంది రైతులకు లబ్ది చేకూరుతుందని భారతీయ జనతా పార్టీ నాయకులు కాటిపల్లి వెంకట రమణారెడ్డి తెలిపారు.

ఈ మేరకు గురువారం విలేకరులతో మాట్లాడారు. వ్యవసాయ చట్టాల విషయంలో ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న ఆరోపణలపై స్వయంగా మోది రైతులను ఉద్దేశించి ప్రసంగిచనున్నారని, శుక్రవారం ఉదయం 12 గంటలకు ప్రత్యక్ష ప్రసారం కామారెడ్డిలోని జెపిఎన్‌ రోడ్డులో ఎల్‌ఇడి ద్వారా ఉంటుందని కార్యక్రమానికి దుబ్బాక ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి రఘునందన్‌ రావు హాజరుకానున్నట్టు తెలిపారు. కామారెడ్డి జిల్లాలోని రైతులు, సామాజిక కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని రైతు చట్టాలపై అవగాహన పెంచుకోవాల్సిందిగా కోరారు.

Check Also

కామారెడ్డి వ్యాపారస్తుల‌కు ముఖ్య గమనిక

కామారెడ్డి, ఏప్రిల్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలో కరోనా వ్యాధి తీవ్రంగా వ్యాప్తి చెందుతున్న ...

Comment on the article