Breaking News

జనవరి 3న సావిత్రిబాయి ఫూలే జయంతి వేడుకలు

ఆర్మూర్‌, డిసెంబర్‌ 24

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జనవరి 3న ఆర్మూర్‌లో జరిగే దేశ మొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రి బాయి పూలే రాష్ట్ర స్థాయి జయంతి వేడుకల పోస్టర్ల ను ఆర్మూర్‌ ప్రాంత వ్యాయామ ఉపాధ్యాయులు ఆవిష్కరించారు. కార్యక్రమానికి గురుకుల విద్యాసంస్థల కార్యదర్శి డాక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌, మార్కెటింగ్‌ శాఖ డైరెక్టర్‌ లక్ష్మిబాయి హాజరువుతున్నట్లు చెప్పారు. ఆర్మూర్‌ డివిజన్‌ ప్రజలంతా హాజరై విజయవంతం చేయాలని కోరారు.

ఆర్మూర్‌ న్యూ నిమ్మల గార్డెన్‌లో కార్యక్రమం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో స్వేరోస్‌ జిల్లా అధ్యక్షులు సాయి, జిల్లా కార్యదర్శి హరీష్‌, రాజు, జిల్లా వ్యాయామ ఉపాధ్యాయ సంఘ ప్రధాన కార్యదర్శి బి మల్లేష్‌ గౌడ్‌, వ్యాయామ ఉపాధ్యాయులు గంగా మోహన్‌, సురేష్‌, నరేంద్ర చారి, శ్రీనివాస్‌, రాజు నాయక్‌, సురేష్‌, బ్రిజేష్‌ పాల్గొన్నారు.

Check Also

భూ కబ్జాపై విచారణ జరపాలి

ఆర్మూర్‌, ఏప్రిల్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ మునిసిపల్‌ లో 9 కోట్ల టిఎండిపి నిధుల‌ ...

Comment on the article