శుక్రవారం ఇందూరు తిరుమల ఆలయంలో వైకుంఠ ఏకాదశి

మోపాల్‌, డిసెంబర్‌ 24

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శుక్రవారం వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఇందూరు తిరుమల ఆలయంలో స్వామి వారి వైకుంఠ ద్వార దర్శనంతో పాటు వివిధ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని మా పల్లె చారిటబుల్‌ ట్రస్టు నర్సింగ్‌పల్లి వారు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నిజామాబాద్‌ గాయకుల చేత సంగీత కచేరి ఉదయం నుండి ప్రారంభమవుతుందని, ఉదయం 8 గంటలకు ఆలయంలో రెండు ఆవిష్కరణ కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు.

ఈ కార్యక్రమాలకు ప్రముఖ సినీ నిర్మాత మరియు ఆలయ ట్రస్టు చైర్మన్‌ దిల్‌ రాజు, శిరీష్‌ అతిథులుగా హాజరు అవుతారని, ఆలయ కాలమాని (క్యాలెండర్‌) ఆవిష్కరణ, 8:15 గంటలకు చిన్నజీయర్‌ స్వామి మఠం ఆయుర్వేద చికిత్సాలయ వైద్యులు డాక్టర్‌ రవీందర్‌ రెడ్డి తయారుచేసిన దంత పొడి (టూత్‌ పౌడర్‌) ఆవిష్కరణ ఉంటాయన్నారు.

అదేవిధంగా నిజామాబాద్‌ నగరంలో వివిధ విభాగాల్లో నిస్వార్థంగా సేవలందిస్తున్న ప్రముఖ వైద్య నిపుణుల బందం ఆలయ దర్శనానికి వస్తున్నారన్నారు. భక్తులు కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి క పాకటాక్షాలు పొందాలని పేర్కొన్నారు.

Check Also

నెలాఖరు వరకు పూర్తిచేయాలి

ధర్పల్లి, సెప్టెంబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ధర్పల్లి మండలం, ఓనాజిపేట్‌ గ్రామంలో పల్లె ప్రగతి పనులు ...

Comment on the article