Breaking News

శాంతి, ప్రేమను బోధించిన శాంతి దూత యేసు క్రీస్తు

బాన్సువాడ, డిసెంబర్‌ 25

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ నియోజకవర్గంలో జరిగిన క్రిస్మస్‌ వేడుకల్లో తెరాస పార్టీ రాష్ట్ర నాయకులు, ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా డీసీసీబీ చైర్మన్‌ పోచారం భాస్కర్‌ రెడ్డి పాల్గొన్నారు. శుక్రవారం క్రిస్మస్‌ పండుగ సందర్బంగా చర్చ్‌ ఫాథర్లు మరియు క్రైస్తవ సోదరి, సోదరమణుల ఆహ్వానం మేరకు చర్చ్‌ ఆఫ్‌ దక్షిణ ఇండియా సంఘం – మెదక్‌ అధ్యక్షమండలం బాన్సువాడ ఫాస్టరేట్‌ చర్చిలో క్రిస్మస్‌ వేడుకల్లో భాగంగా చేసిన ప్రార్ధనలో పాల్గొని రాష్ట్ర క్రైస్తవ సోదరి, సోదరమణులకు క్రిస్మస్‌ శుభాకాంక్షలు తెలిపారు.

సమాజానికి శాంతి, ప్రేమను ప్రభోదించిన శాంతి దూత ధైవకుమారుడు యేసు క్రీస్తు బోధనలు మానవాళికి మార్గదర్శకాలు అని తెలిపారు. కోవిడ్‌ నిబంధలను పాటిస్తూ బంధుమిత్రులతో కలిసి క్రిస్మస్‌ పండుగను ఆహ్లాదకరంగా ఆనందంగా జరుపుకోవలసిందిగా డీసీసీబీ చైర్మన్‌ కోరారు. చర్చ్‌ అభివద్ధి కోసం మన ప్రియతమ నాయకులు సభాపతి పోచారం శ్రీనివాస్‌ రెడ్డి ఇప్పటికే రూ.20 లక్షలు మంజూరు చేశారని, చర్చ్‌ అభివద్ధి పనులు కూడా కొనసాగుతున్నాయన్నారు.

ఇంకా ఎటువంటి అభివద్ధి కోసమైనా తాను కషి చేస్తానని భాస్కర్‌ రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ జంగం గంగాధర్‌, చర్చ్‌ ఫాథర్‌ యేసు దాస్‌, బాన్సువాడ మండల ఎంపీపీ దొడ్ల వెంకట రామ్‌ రెడ్డి, ఏఎంసి చైర్మన్‌ పాతబాలకష్ణ, ప్యాక్స్‌ చైర్మన్‌ పిట్ల శ్రీధర్‌, కౌన్సిలర్‌ హకీం, క్రైస్తవ కమ్యూనిటీ నియోజకవర్గ నాయకులు జనరల్‌ సెక్రటరీ నాయకులు ప్రశాంత్‌ కుమార్‌, స్టీవెన్‌, సుకుమార్‌, దేవదాస్‌, సూర్య జేమ్స్‌, మున్సిపాలిటీ కో ఆప్షన్‌ తార, ఇతర సోదరి సోదరమణులు పాల్గొన్నారు.

Check Also

అభివృద్ధి పనులు పరిశీలించిన స్పీకర్‌

బాన్సువాడ, జనవరి 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ పట్టణంలో జరుగుతున్న అభివద్ధి పనులను ప్రజాప్రతినిధులు, అధికారులతో ...

Comment on the article