Breaking News

Daily Archives: December 28, 2020

ఫోన్‌ ఇన్‌లో 18 ఫిర్యాదులు

కామారెడ్డి, డిసెంబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఫోన్‌ ఇన్‌ కార్యక్రమానికి 18 ఫిర్యాదులు వచ్చినట్లు కామారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్‌ పి.యాదిరెడ్డి తెలిపారు. కామారెడ్డి కలెక్టరేట్లోని జనహిత భవనంలో సోమవారం ఫోన్‌ ఇన్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. రెవెన్యూ శాఖకు సంబంధించి 7, గ్రామ పంచాయతీలకు సంబంధించి 6, వ్యవసాయ శాఖకు 3, మున్సిపల్‌, ఎక్సైజ్‌ శాఖలకు సంబంధించి ఒకటి చొప్పున ఫిర్యాదులు వచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Read More »

జిల్లా కలెక్టర్‌కు రాష్ట్రపతి అవార్డు

కామారెడ్డి, డిసెంబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కలెక్టరు డాక్టర్‌ ఎ.శరత్‌ బుధవారం 30 వ తేదీన భారత రాష్ట్రపతి నుండి అవార్డు అందుకోనున్నారు. డిజిటల్‌ ఇండియా-2020 అవార్డులకు సంబంధించి ఎక్స్లెన్స్‌ ఇన్‌ డిజిటల్‌ గవర్నెన్స్‌ విభాగంలో 30 వ తేదీన ఉదయం 11 గంటలకు కొత్త ఢిల్లీలోని ఎగ్యాన్‌ భవన్‌ లోని ఫైనరీ హాలులో జరిగే కార్యక్రమంలో కలెక్టర్‌ అవార్డును అందుకోనున్నారు. జిల్లా ఇన్‌ ఫర్‌ మేటిక్‌ ఆఫీసర్‌ బండి రవి కూడా కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ ...

Read More »

బండి సంజయ్‌కు మంత్రి సవాల్‌

ఎల్లారెడ్డి, డిసెంబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో స్థానిక శాసన సభ్యులు జాజాల సురేందర్‌తో కలిసి రాష్ట్ర రోడ్లు-భవనాలు, గహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి పలు అభివద్ధి పనుల శంకుస్థాపన, భూమిపూజ, ప్రారంభోత్సవం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎల్లారెడ్డి చెరువు కట్టపై 3.56 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించే రోడ్‌ శంకుస్థాపనతో పాటు 5 కోట్లతో నిర్మించే బ్రిడ్జి నిర్మాణ పనుల శంకుస్థాపన మరియు భూమిపూజ నిర్వహించారు. ఎల్లారెడ్డి ...

Read More »

ఆపరేషన్‌ నిమిత్తం వృద్ధురాలికి రక్తదానం

కామారెడ్డి, డిసెంబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలలో ఆపరేషన్‌ నిమిత్తం రామారెడ్డి గ్రామానికి చెందిన లక్ష్మీ అనే 75 సంవత్సరాల వద్ధురాలికి ఏబి పాజిటివ్‌ రక్తం అవసరం కావడంతో వారి బంధువులు కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకుడు బాలును సంప్రదించారు. తాడ్వాయి మండల కేంద్రానికి చెందిన నవీన్‌ మానవతా దక్పథంతో రక్తదానం చేసి ప్రాణాలు కాపాడారు. ఈ సందర్భంగా బాలు మాట్లాడుతూ యువకులు రక్తదానం చేయడానికి ముందుకు రావాలని, రక్తదానం ప్రాణదానంతో సమానమన్నారు. రక్తదానం ...

Read More »

31 వరకు రీవాల్యుయేషన్‌

డిచ్‌పల్లి, డిసెంబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో గల బి.ఎడ్‌. మొదటి, రెండవ, మూడవ సెమిస్టర్‌ బ్యాక్‌ లాగ్‌ / ఇంప్రూవ్‌ మెంట్‌ మరియు నాల్గవ సెమిస్టర్‌ రెగ్యూలర్‌ థియరీ పరీక్షలకు ఈ నెల 31 వరకు రివాల్యూయేషన్‌ / రీకౌంటింగ్‌కు చివరి తేదీ నిర్ణయించారు. ఒక్కో పేపర్‌కు రివాల్యూయేషన్‌ 500 రూపాయలు, ఒక్కో పేపర్‌కు రీకౌంటింగ్‌ 300 రూపాయలు, రివాల్యూయేషన్‌ / రీకౌంటింగ్‌ ఫారం 25 రూపాయలుగా నిర్ణయించారు. కావున ఈ విషయాన్ని ...

Read More »

ఎంపిక చేసిన పోస్టాఫీసుల ద్వారా ఆధార్‌ రిజిస్ట్రేషన్‌

నిజామాబాద్‌, డిసెంబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో ఎంపిక చేసిన 16 పోస్టాఫీసుల ద్వారా కొత్తగా ఆధార్‌ రిజిస్ట్రేషన్‌కు, మార్పులకు అవకాశం కల్పిస్తున్నట్లు జిల్లా పోస్టల్‌ శాఖ సూపరింటెండెంట్‌ సుబ్రహ్మణ్యం ఒక ప్రకటనలో తెలిపారు. నిజామాబాదులోని హెడ్‌ పోస్ట్‌ ఆఫీస్‌, ఆర్‌ఎస్‌ పోస్ట్‌ ఆఫీస్‌, సుభాష్‌ నగర్‌లోని సబ్‌ పోస్ట్‌ ఆఫీస్‌, నవీపేట, శక్కర్‌ నగర్‌, బోధన్‌, మద్నూర్‌, ఎల్లారెడ్డి, భీమ్గల్‌, వేల్పూర్‌, కమ్మర్పల్లి, ఆర్మూర్‌, నందిపేట్‌ సబ్‌ పోస్ట్‌ ఆఫీస్‌లలో కొత్తగా ఆధార్‌ కార్డు పొందేవారు లేదా ఆధార్‌ ...

Read More »

యు టర్న్‌లో ఆంతర్యమేమి?

బోధన్‌, డిసెంబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కేంద్రం తీసుకోచ్చిన వ్యవసాయ చట్టాల విషయంలో కేసీఆర్‌ యూ టర్న్‌ తీసుకోవడాన్ని నిరసిస్తూ సోమవారం నిజామాబాద్‌ జిల్లా బోధన్‌ పట్టణంలో సీఎం కేసీఆర్‌ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్బంగా సీపీఐ (ఎం-ఎల్‌) న్యూ డెమోక్రసీ పార్టీ బోధన్‌ సబ్‌ డివిజన్‌ కమిటీ కార్యదర్శి బి.మల్లేష్‌ మాట్లాడుతూ నిన్నటి వరకు కేంద్రం చేసిన చట్టాలు రైతాంగాన్ని దగా చేసేవి అని, వాటికి వ్యతిరేకంగా యుద్దం చేయాలని చెప్పి, మొన్న జరిగిన భారత్‌ బంద్‌లో ...

Read More »

వారం రోజుల్లో చెక్‌ డ్యాముల పనులు ప్రారంభం కావాలి

నిజామాబాద్‌, డిసెంబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో మంజూరు చేసిన 30 చెక్‌ డ్యామ్‌ల నిర్మాణాలకు వారం రోజుల్లో పనులు ప్రారంభం కావాలని జిల్లా కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి నీటిపారుదల శాఖ ఇంజనీర్లను ఆదేశించారు. సోమవారం క్యాంప్‌ కార్యాలయం నుండి సెల్‌ కాన్ఫరెన్సు ద్వారా చెక్‌ డ్యామ్‌ల నిర్మాణాలపై సంబంధిత ఇంజనీరింగ్‌, రెవెన్యూ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో మంజూరైన మొత్తం 30 చెక్‌ డ్యామ్‌ల నిర్మాణాలకు శనివారం కల్లా పనులు ప్రారంభం కావాలని, లేదంటే సంబంధిత ...

Read More »