Breaking News

ఖాళీ పోస్టులు భర్తీచేయాలి… నిరుద్యోగ భృతి చెల్లించాలి

కామారెడ్డి, డిసెంబర్‌ 29

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ యువ మోర్చా రాష్ట్ర శాఖ పిలుపు మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని, నిరుద్యోగ భతి చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ జాతీయ రహదారుల దిగ్బంధనం కార్యక్రమంలో భాగంగా టెక్రియల్‌ చౌరస్తా వద్ద రాస్తా రోకో నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులు 22 మంది కార్యకర్తలను అరెస్టు చేసి దేవునిపల్లి పోలీస్‌ స్టేషన్‌కి తరలించారు.

ఈ సందర్భంగా బిజెవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షుడు పడాల ఆనంతకష్ణ మాట్లాడుతూ ఉద్యోగాలకై కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో ఉద్యోగాల నోటిఫికేషన్లు లేవని, కెసిఆర్‌ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఒక్క సారి కూడా గ్రూప్‌ 1 పోస్టుల భర్తీ చేయలేదని, యువత కోటి ఆశలతో నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తున్నారని, ఇకనైనా భర్తీ చేయాల్సిన రెండు లక్షల ఉద్యోగాలకు ఉద్యోగ ప్రకటన వెంటనే విడుదల చేయాలన్నారు.

జోన్ల సమస్యను సాకుగా చూపి ఉద్యోగాల భర్తీని ప్రభుత్వమే అడ్డుకోవాలని చూస్తోందన్నారు. నిరుద్యోగ భతి చెల్లిస్తామని మాయ మాటలు చెప్పి రెండో సారి అధికారంలోకి వచ్చిన్నప్పటికి ఇప్పటికి ఒక్క రూపాయి కూడా చెల్లించలేదని సీఎం కేసిఆర్‌ ప్రకటించినట్టు రెండవ సారి అధికారంలోకి వచ్చినప్పటి నుండి రాష్ట్రం లో ఉన్న ప్రతి నిరుద్యోగికి తక్షణం నిరుద్యోగ భతి చెల్లించాలని డిమాండ్‌ చేశారు. అంతే కాకుండా కరోనా లాక్‌ డౌన్‌ కారణంగా తొమ్మిది నెలలుగా జీతాలు లేక తీవ్ర ఇబ్బందులకు గురైన ప్రైవేట్‌ టీచర్స్‌కు, ప్రైవేట్‌ లెక్చరర్లకు తక్షణం 9 నెలల గౌరవ వేతనం ఇచ్చి వారిని ఆదుకోవాలన్నారు.

Check Also

మానవత్వాన్ని చాటిన రక్తదాత లావణ్య

కామారెడ్డి, మే 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రం దేవునిపల్లి గ్రామానికి చెందిన ఈశ్వరయ్య ...

Comment on the article