బోధన్, జనవరి 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నేటి పాలకులు అనుసరించే ప్రజా, కార్మిక, రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా జరుతున్న పోరాటాల్లో యువత ముందుండాలని సీపీఐ (ఎం-ఎల్) న్యూ డెమోక్రసీ పార్టీ బోధన్ సబ్ డివిజన్ కమిటీ కార్యదర్శి బి మల్లేష్ పిలుపు నిచ్చారు. ఆదివారం నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణం పాన్ గల్లీలో పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో జరిగిన కామ్రేడ్ కిరణ్ కుమార్ సంస్మరణ సభలో బి.మల్లేష్ మాట్లాడారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ప్రగతి శీల యువజన సంఘం (పీవైఎల్ ...
Read More »Monthly Archives: January 2021
మిగిలిన వారికి 1, 2 తేదీల్లో చుక్కల మందు
కామారెడ్డి, జనవరి 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆదివారం పల్స్ పోలియో దినోత్సవం సందర్భంగా జిల్లాలో 99.77 శాతం పోలియో చుక్కల మందు వేయడం జరిగిందని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ చంద్రశేఖర్ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో 0-5 సంవత్సరం వయసు గల 1 లక్ష 3 వేల 980 చిన్నారులకు గాను 1 లక్ష 3 వేల 741 మంది చిన్నారులకు పోలియో చుక్కల మందు వేయడం జరిగిందని తెలిపారు. ఆదివారం పోలియో చుక్కల మందు ...
Read More »ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్య
కామారెడ్డి, జనవరి 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సోమార్పేట్ గ్రామానికి చెందిన మెట్టు రాములు (65) అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. తన కూతురు పెళ్లికి చేసిన అప్పును తీర్చలేక మనస్థాపం చెంది జీవితంపై విరక్తితో ఇంట్లో దూలానికి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మాచారెడ్డి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
Read More »సిఎం సహాయనిధి చెక్కుల పంపిణీ
నాగిరెడ్డిపేట్, జనవరి 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆదివారం నాగిరెడ్డిపేట్ మండలం గోళీలింగాల గ్రామంలోని నలుగురు పేద ప్రజలు హాస్పిటల్లో చికిత్స పొందిన బిల్లులను ముఖ్య మంత్రి సహాయనిధి ద్వారా 1 లక్ష 14 వేల 500 రూపాయల 4 చెక్కులను ఖాజామొయినుద్దీన్, రమాదేవి, పిట్ల భవాని, పి.వన్ కుమార్ ఇంటింటికి బైక్ పై తిరుగుతూ వారి బాగోగులు తెలుసుకొని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ చెక్కులు పంపిణీ చేశారు. కొన్ని రోజుల క్రితం ప్రమాదవశాత్తు మోహన్ రెడ్డి కుమారుడు నిశాంత్ ...
Read More »రక్తలేమితో బాధపడుతున్న మహిళకు రక్తదానం
కామారెడ్డి, జనవరి 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలో రక్తలేమితో బాధపడుతు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నిర్మల అనే మహిళకు అత్యవసరంగా 5 యూనిట్ల పాజిటివ్ రక్తం అవసరం ఉండగా బిజెవైఎం కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు బంగ్లా చైతన్య గౌడ్ స్పందించి కార్యకర్తలు రంగు అరవింద్, రంజిత్ కుమార్, బోనగిరి శివకుమార్, బోయినిపల్లి నిఖిల్ రాజ్‌తో రక్తం ఇప్పించారు. రక్తదాన కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా బిజెవైఎం జిల్లా అధ్యక్షుడు బంగ్లా చైతన్య గౌడ్, శివ కుమార్ బోనగిరి, మన్నే ...
Read More »నిండు జీవితానికి 2 పోలియో చుక్కలు
నిజామాబాద్, జనవరి 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భవిష్యత్తులో పిల్లలు అంగవైకల్యంతో బాధ పడకూడదంటే వారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి తెలిపారు. పోలియో చుక్కల కార్యక్రమం సందర్బంగా ఆదివారం స్థానిక దుబ్బ ప్రాంతంలో అర్బన్ హెల్త్ సెంటర్లో పోలియో చుక్కల కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా పలువురు చిన్నారులకు ఆయన పోలియో చుక్కలు వేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 1.83 లక్షల మంది పిల్లలకు ఈసారి పోలియో చుక్కలు వేయడానికి ...
Read More »మారిన లైఫ్ స్టైల్ తోనే అనారోగ్యాలు
నిజామాబాద్, జనవరి 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శారీరక శ్రమ లేకపోవడం ఆహారపు అలవాట్లలో మార్పు నిద్రలేమి తదితర కారణాల వల్ల అనారోగ్య సమస్యలు వస్తున్నాయని జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి అన్నారు. హైదరాబాద్ గ్రేసీ స్వచ్ఛంద సంస్థ అందజేసిన క్యాన్సర్ పరీక్షల మొబైల్ వాహనాన్ని స్థానిక ఇందూరు క్యాన్సర్ ఆస్పత్రిలో ఎమ్మెల్సీ రాజేశ్వరరావుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ గతంలో ప్రజలు ఆరోగ్యదాయకమైన ఆహారాన్ని తీసుకుంటూ శారీరక శ్రమతో పాటు నడక మంచి ...
Read More »జిల్లా షెడ్యూల్ కులాల సంక్షేమ అధికారిగా రజిత
కామారెడ్డి, జనవరి 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా షెడ్యూల్ కులాల సంక్షేమ అధికారిగా రజిత శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఇంతవరకు ఆమె జగిత్యాల జిల్లా ఏఎస్‌డబ్ల్యూవో గా పనిచేసి పదోన్నతిపై కామారెడ్డికి వచ్చారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్‌ని శనివారం ఆమె మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించారు.
Read More »పల్స్‌పోలియోకు సర్వం సిద్ధం
కామారెడ్డి, జనవరి 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమం సన్నాహక ఏర్పాట్లు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డా.చంద్రశేఖర్ పర్యవేక్షించారు. శనివారం పట్టణ ఆరోగ్య కేంద్రం, రాజీవ్ నగర్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు రామరెడ్డి, అన్నారం, మాచారెడ్డిలో సందర్శించారు. పల్స్ పోలియోలో పాల్గొనే సిబ్బందికి, నర్సింగ్ విద్యార్థులకు శిక్షణ ఇచ్చారు. జిల్లా వ్యాప్తంగా అప్పుడే పుట్టిన శిశువు మొదలుకొని 5 సంవత్సరా ల లోపు ప్లిను 1 లక్ష 3 వేల 980 లక్ష్యంగా ...
Read More »ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తికి ఏబి ప్లేట్ లెట్స్ అందజేత
నిజామాబాద్, జనవరి 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని జయ వైద్యశాలలో శ్యామ్ రెడ్డి 45 సంవత్సరాల వయసు కలిగిన బసన్న పల్లి గ్రామానికి వ్యక్తికి ఏబి పాజిటివ్ ప్లేట్లెట్స్ పడిపోవడంతో అత్యవసరంగా వారికి కావలసిన ప్లేట్‌లెట్స్‌ను పట్టణానికి చెందిన నవజీవన్ వైద్యశాల ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ సృజన్ రెడ్డి, లిఖిత డయాగ్నొస్టిక్ సెంటర్ జిల్లా ఇంచార్జ్ నాగరాజు మానవతా దృక్పథంతో స్పందించి ఏబి పాజిటివ్ స్థానిక ప్రభుత్వ వైద్యశాలలో అందజేయడం జరిగిందని, వీరికి కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకులు ...
Read More »అమరవీరులకు ఘన నివాళి
నిజామాబాద్, జనవరి 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈ నెల 30న అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని వారికి ఘనంగా నివాళులు అర్పించారు. శనివారం ప్రగతి భవన్ సమావేశ మందిరంలో అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి అధ్యక్షతన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. జిల్లా అధికారులు, ప్రగతి భవన్ లోని శాఖల అధికారులు, సిబ్బంది రెండు నిమిషాలు మౌనం పాటించి దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమరుల కోసం ఘనంగా నివాళి అర్పించారు. కార్యక్రమములో అడిషనల్ ...
Read More »యానంపల్లిలో పోలీసు కళాజాత
డిచ్పల్లి, జనవరి 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కార్తికేయ ఆదేశాల మేరకు పోలీసు కళా జాతా కార్యక్రమం డిచ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని యానంపల్లి గ్రామంలో నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులకు పలు సూచనలు, సలహాలు అందించారు. ముఖ్యంగా ఆన్లైన్ మోసాల గురించి జాగ్రత్త వహించాలని, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరి హెల్మెట్ ధరించాలని, లేకుంటే ప్రయాణం చేయొద్దని, రోడ్డు ప్రమాదాలు జరగకుండా జాగ్రత్త వహించాలని సూచించారు. అదేవిధంగా చిన్న చిన్న సమస్యలకు ఆత్మహత్యలకు పాల్పడవద్దని, సమస్యలకు పరిష్కార ...
Read More »మొక్కలను ఉత్పత్తి చేయుటలో కణజాల వర్ధన పద్ధతి లాభాదాయకం
డిచ్పల్లి, జనవరి 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తక్కువ సమయంలో ఎక్కువ మొక్కలను ఉత్పత్తి చేయడంలో కణజాల వర్ధన పద్ధతులు లాభదాయకంగా వుంటాయని బాంగ్లాదేశ్‌కు చెందిన ఆచార్య అబ్దుల్లా తెలిపారు. తెలంగాణ విశ్వవిద్యాలయం వక్ష శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం ఇంటర్నేషనల్ కాన్ఫరెన్సు ఆన్ ”ఎమర్జింగ్ ట్రెండ్స్ ఇన్ లైఫ్ సైన్సెస్” అనే అంశంపై రెండు రోజుల అంతర్జాల సదస్సు జరిగింది. సదస్సులో ఆయన మాట్లాడుతూ కణజాల వర్ధనం ద్వారా అంతరించిపోతున్న మొక్కలను ఉత్పత్తి చేసి వాటిని సంరక్షించవచ్చన్నారు. అనంతరం ఝార్ఖండ్ ...
Read More »చెక్ డ్యాం నిర్మాణ స్థలాన్ని పరిశీలించిన స్పీకర్
బాన్సువాడ, జనవరి 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ పట్టణ సమీపంలో మంజీర నదిపై నూతనంగా నిర్మించే చెక్ డ్యాం నిర్మాణ స్థలాన్ని శుక్రవారం తెలంగాణ రాష్ట్ర శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ మంజీర నదిపై బాన్సువాడ నియోజకవర్గ పరిధిలో మొత్తం నాలుగు చెక్ డ్యాం ల నిర్మాణానికి ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసిందని, బీర్కుర్ వద్ద రూ. 28 కోట్లతో నిర్మించే చెక్ డ్యాం పనులకు గురువారం శంకుస్థాపన చేసి పనులను ...
Read More »పల్లె ప్రగతి పనులపై కలెక్టర్ సీరియస్
కామారెడ్డి, జనవరి 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పల్లె ప్రగతి పనులలో ఎలాంటి నిర్లక్ష్యం వహించినా చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ తెలిపారు. శుక్రవారం కామారెడ్డి మండలం గర్గుల్ గ్రామంలో పల్లె ప్రగతి పనులను కలెక్టర్ పరిశీలించారు. పల్లె ప్రకతి వనంలో కొన్ని మొక్కలు ఎండిపోవడం, నిర్వహణ సక్రమంగా లేకపోవడం, వాచర్‌ను నియమించకపోవడం, విధుల పట్ల నిర్లక్ష్యం వహించినందుకు గ్రామ పంచాయతీ కార్యదర్శిని సస్పెండ్ చేయాలని, మండల పంచాయతీ అధికారికి చార్జి మెమో ఇవ్వాలని, గ్రామ సర్పంచుకు ...
Read More »తహసీల్దారుని అభినందించిన కలెక్టర్
కామారెడ్డి జనవరి 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ధరణి రిజిస్ట్రేషన్ ద్వారా పెండింగ్‌లో వున్న కేసులను వారం లోగా పరిష్కరించాలని జిల్లా కలెక్టరు డాక్టర్ ఎ.శరత్ తహశీలుదార్లను ఆదేశించారు. శుకవారం జనహితలో ఆర్డిఓలు, తహశీలుదార్లు, రైస్ మిల్స్ యజమానులతో ధరణి, సిఎంఆర్ కార్యక్రమాలను సమీక్షించారు. స్లాట్స్ బుక్ చేసుకున్న వారి పెండింగ్ వివరాలను మండల వారిగా ఆయన సమీక్షించి, వారం రోజుల వ్యవధిలో పెండింగ్ కేసులను పరిష్కరించాలని ఆదేశించారు. డబుల్ రిజిస్ట్రేషన్స్ కాకుండా తహశీలుదారు చూసుకోవాలని సూచించారు. పెండింగ్ కేసులు లేని ...
Read More »జాతీయ తైక్వాండో ఛాంపియన్షిప్ పోటీలకు నిజామాబాద్ క్రీడాకారులు
ఆర్మూర్, జనవరి 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈనెల 31 నుండి బెంగళూరులో జరగనున్న జాతీయ స్థాయి తైక్వాండో ఛాంపియన్ షిప్ పోటీలలో నిజామాబాద్ పట్టణానికి చెందిన తైక్వాండో క్రీడాకారులు పాల్గొననున్నారు. బాలికల విభాగంలో మద్దుల శ్రీనిక 12 సంవత్సరాలలోపు సబ్ జూనియర్ విభాగంలో, అలాగే 12 సంవత్సరాల బాలుడు శ్రీహిత్ గౌడ్, సీనియర్ విభాగంలో రాజు పాల్గొననున్నారు. నిజామాబాదు టైక్వాండో అసోసియేషన్ నుండి క్రీడాకారులు పాల్గొననున్నారు. క్రీడాకారులకు నిజామాబాద్ పట్టణ ఏసిపి ఆఫ్ పోలీస్ శ్రీనివాస్ కుమార్ క్రీడాకారులకు అభినందించారు. ...
Read More »పక్క రాష్ట్రాలకు కూడా పంపుతున్నాము…
నిజామాబాద్, జనవరి 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రగతి భవనంలో విజయ డైరీ ఛైర్మెన్ లోక భూమరెడ్డి, ఎండి శ్రీనివాస్ రావ్‌తో కలసి జిల్లా కలెక్టర్ పాల ఉత్పత్తి కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ పాల అమ్మకాలు 3 లక్షల 72 వేల నుండి 4 లక్షల లీటర్ల వరకు చేరుకున్నదని, పాల సేకరణ 2.50 లక్షల నుండి 5 లక్షల లీటర్ల వరకు చేరుకోవడమైనదని తెలిపారు. ఇక్కడనే కాకుండా మహారాష్ట్ర తదితర రాష్ట్రాలకు పంపుతున్నామన్నారు. గతంలో ఇంటింటా ...
Read More »మానవతా సదన్‌కు యువ ఇంజనీర్ సాయం
నిజామాబాద్, జనవరి 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అనాథ బాలల పునరావాస కేంద్రం మానవతా సదన్ డిచ్పల్లి బాలల సంక్షేమం కోసం డిచ్పల్లి మండలం ముల్లంగి గ్రామానికి చెందిన రైతు అనంత్‌రెడ్డి పెద్ద కుమార్తె సాప్ట్వేర్ ఇంజనీర్ అనుజారెడ్డి ఇంజనీరుగా తన మొదటి నెల వేతనం రూ. 40 వేలు చెక్కు రూపంలో శుక్రవారం జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డికి క్యాంపు కార్యాలయంలో అందజేశారు. జిల్లా కలెక్టర్ ఈ సందర్భంగా యువ ఇంజనీరును అభినందించారు. అనుజారెడ్డి సేవా దృక్పథం స్ఫూర్తి దాయకం, ఆదర్శనీయమని, ...
Read More »ప్రారంభానికి సిద్ధం చేశాం…
కామారెడ్డి, జనవరి 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి పట్టణంలో నడుస్తున్న ఎల్లారెడ్డి గిరిజన గురుకుల వసతిగహాన్ని నెల రోజుల వ్యవధిలో ఎల్లారెడ్డిలోని సొంత భవనంలో ఏర్పాటు చేస్తామని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ అన్నారు. గురువారం ఆయన టెలీ కాన్ఫరెన్సులో సిఎస్ సోమేశ్ కుమార్‌తో మాట్లాడారు. ఫిబ్రవరి 1న జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, వసతి గహాలు ప్రారంభానికి సిద్ధం చేశామని చెప్పారు. 9,10 తరగతుల విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి పాఠశాలకు పంపడానికి అనుమతి పత్రాలపై సంతకాలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఒంటిమామిడి ...
Read More »