హైదరాబాద్, జనవరి 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డిని తన అధికారిక నివాసంలో కలిసి శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి 2021 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా స్పీకర్ పోచారం మంత్రి వేములను ఆశీర్వదించారు. మంత్రి వెంట శుభాకాంక్షలు తెలిపిన వారిలో అసెంబ్లీ సెక్రెటరీ వేదాంతం నర్సింహాచార్యులు ఉన్నారు.
Read More »Daily Archives: January 1, 2021
సోషల్ వర్క్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు డాక్టరేట్
డిచ్పల్లి, జనవరి 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయం దక్షిణ ప్రాంగణం, భిక్నూర్లో గల సోషల్ వర్క్స్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా ఉన్న భూక్యా వీరభద్రంకు ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి సోషల్ వర్క్ విభాగంలో గురువారం డాక్టరేట్ పట్టా ప్రదానం చేశారు. సోషల్ వర్క్ విభాగంలోని సుప్రసిద్ధ ప్రొఫెసర్ ఎస్.ఎఫ్ చంద్రశేఖర్ పర్యవేక్షణలో తన పరిశోధన ”మెరుగైన సమాజం పట్ల కార్పొరేట్ సామాజిక బాధ్యత: తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాపై అధ్యయనం” అనే అంశంపై చేసిన పరిశోధన గ్రంధానికి ...
Read More »పేదలకు దుప్పట్లు పంపిణీ చేసిన జిల్లా జడ్జి, జిల్లా కలెక్టర్
నిజామాబాద్, జనవరి 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నూతన సంవత్సరం సందర్బంగా జిల్లా జడ్జి కె కె సాయి రమాదేవి, జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి, కమిషనర్ ఆఫ్ పోలీస్ కార్తికేయ తదితరులు వేడుకల్లో పాల్గొని జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. కొత్త సంవత్సరంలో ప్రజలందరూ ఆయురారోగ్యాలు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నట్లు వారు తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జితేష్ వి పాటిల్, పలువురు అధికారులు ప్రజా ప్రతినిధులు సిబ్బంది ప్రజలు స్వచ్చంద సేవా ...
Read More »ఎర్రపహాడ్‌లో యువకుల రక్తదానం
కామారెడ్డి, జనవరి 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తాడ్వాయి మండలంలోని ఎర్రపహాడ్ గ్రామంలో కామారెడ్డి రక్తదాతల సమూహం ఆధ్వర్యంలో ప్రాథమిక వైద్య శాలలో పిఎసిఎస్ చైర్మన్ కపిల్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకుడు బాలు మాట్లాడుతూ చైర్మన్ కపిల్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమని, ప్రస్తుత తరుణంలో రక్తనిల్వలు లేకపోవడం వలన రోగులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని, రక్తదాన ...
Read More »