Breaking News

Daily Archives: January 4, 2021

అంధుల జీవితాల్లో వెలుగులు నింపిన మహనీయుడు

నిజామాబాద్‌, జనవరి 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అంధుల జీవితాలలో వెలుగులు నింపిన, అంధ విద్యార్థులకు లిపిని కలిపించిన మహనీయుడు లూయిస్‌ బ్రెయిలీ అని నగర మేయర్‌ దండు నీతూ కిరణ్‌ అన్నారు. సోమవారం లూయిస్‌ బ్రెయిలీ 212 వ జయంతి కార్యక్రమాన్ని స్నేహ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా మేయర్‌ మాట్లాడుతూ విద్యార్థుల మధ్య కార్యక్రమం నిర్వహించుకోవటం చాలా సంతోషంగా ఉందని, అంధుల జీవితాలలో వెలుగులు నింపి వారి జీవితానికి ఒక దిశ, దశను చూపిన బ్రెయిలీ మార్గదర్శంలో ...

Read More »

కోనసీమను తలదన్నే విధంగా తెలంగాణలో నాట్లు

ఆర్మూర్‌, జనవరి 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కోనసీమను తలదన్నే విధంగా తెలంగాణలో నాట్లు పడుతున్నాయని రాష్ట్ర రోడ్లు భవనాలు శాసనసభ వ్యవహారాల శాఖ మాత్యులు వేముల ప్రశాంత్‌ రెడ్డి అన్నారు. సోమవారం బాల్కొండ నియోజకవర్గంలోని వేల్పూర్‌, ఏర్గట్ల, ముప్కాల్‌ మండలాల్లో పలు అభివద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. వెంకటాపూర్‌- రామన్నపేట మధ్య రూ. 6.65 కోట్లతో నిర్మించే పెద్ద వాగుపై చెక్‌ డ్యామ్‌ పనులకు శంకుస్థాపన, ఏర్గట్ల మండల కేంద్రంలో రూ. 22 లక్షల వ్యయం తో నిర్మించిన రైతు ...

Read More »

పంట రుణాల పరిధి పెంపు

నిజామాబాద్‌, జనవరి 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతులకు పంట రుణాల మొత్తాన్ని పెంచినట్లు జిల్లా కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి తెలిపారు. సోమవారం ప్రగతి భవన్‌ సమావేశ మందిరంలో పంట రుణాల సూచికపై సాంకేతిక సలహా మండలి సమావేశం జిల్లా కలెక్టర్‌ అధ్యక్షతన ఏర్పాటు చేశారు. ఉమ్మడి జిల్లా అధికారులతో పాటు రైతులు హాజరయ్యారు. వీరి అందరి సమక్షంలో రాష్ట్ర స్థాయి కమిటీకి గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం 10 నుండి 20 శాతం రుణాల సూచిక పెంపుదల చేస్తూ ...

Read More »

ప్రపంచ ప్రఖ్యాత బాక్స‌ర్‌‌ నిజామాబాద్‌ ముద్దు బిడ్డ

నిజామాబాద్‌, జనవరి 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గత నెల డిసెంబర్‌లో జర్మనీలో జరిగిన కలోన్‌ బాక్సింగ్‌ ప్రపంచ ఛాంపియన్‌ షిప్‌లో కాంస్య పతకం సాధించి నిజామాబాద్‌ నగరానికి వచ్చిన ప్రఖ్యాత బాక్సర్‌ హుసాముద్దిన్‌ను తెలంగాణ జాగతి సభ్యులు సోమవారం ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా తెలంగాణ జాగతి రాష్ట్ర నాయకులు నరాల సుధాకర్‌ మాట్లాడుతూ ప్రపంచ ప్రఖ్యాతి చెందిన బాక్సర్‌ నిజామాబాద్‌ ముద్దుబిడ్డ కావడం సంతోషకరమని అన్నారు. కేవలం తెలంగాణనే కాకుండా మొత్తం భారతదేశం గర్వపడేలా చేశాడన్నారు. కార్యక్రమంలో దండు ...

Read More »

నీటి పారుదల రంగాన్ని అభివృద్ధి బాటలో తీసుకెళ్ళాలి

బాన్సువాడ, జనవరి 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా బాన్సువాడ డివిజన్‌ నీటి పారుదల శాఖ సూపరింటెండ్‌ ఇంజినీర్‌ కార్యాలయాన్ని కామారెడ్డి జిల్లా చీఫ్‌ ఇంజినీర్‌ టి. శ్రీనివాస్‌తో కలిసి ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా డీసీసీబీ చైర్మన్‌ పోచారం భాస్కర్‌ రెడ్డి సోమవారం ప్రారంభించారు. కామారెడ్డి జిల్లా నూతన చీఫ్‌ ఇంజినీర్‌గా మరియు బాన్సువాడ ఇంచార్జ్‌ ఎస్‌.ఈ.గా నియమితులై ఛార్జి తీసుకున్న టి. శ్రీనివాస్‌ని శాలువతో సత్కరించి, వారికి స్వాగతం పలికారు. డివిజన్‌లో వారికి అన్ని విధాలుగా రాష్ట్ర శాసన ...

Read More »

భారీ అగ్ని ప్రమాదం

హైదరాబాద్‌, జనవరి 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణలో మరో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. నల్గొండ జిల్లాలోని నాగార్జున సాగర్‌ ప్రాజెక్టు ప్రధాన జలవిద్యుత్‌ ఉత్పాదన కేంద్రంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. విద్యుత్‌ ఉత్పత్తి జరుగుతున్న సమయంలో ట్రాన్స్‌ ఫార్మర్‌ నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రమాదాన్ని గుర్తించిన ఉద్యోగులు చాకచక్యంతో వ్యవహరించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. దీంతో అక్కడ భారీ ప్రమాదమే తప్పింది. ఆకస్మాత్తుగా మంటలు ఎలా వచ్చాయన్నది ఇంకా తెలియడం లేదు. దీనిపై అప్రమత్తమైన ...

Read More »

కెమిస్ట్రీలో నీలి వాసవికి డాక్టరేట్‌

డిచ్‌పల్లి, జనవరి 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయం కెమిస్ట్రీ విభాగంలో హెచ్‌ఓడి., సైన్స్‌ డీన్‌ మరియు టీయూ రిజిస్ట్రార్‌ ఆచార్య నసీం పర్యవేక్షణలో పరిశోధకురాలు నీలి వాసవి ”కారెక్టరైజేషన్‌ స్టడీస్‌ ఆఫ్‌ సాలిడ్‌ వేస్ట్‌, లీచెట్‌ అండ్‌ దేర్‌ ఇంపాక్ట్‌ ఆన్‌ గ్రౌండ్‌ వాటర్‌ అండ్‌ సాయిల్‌ క్వాలిటి అరౌండ్‌ సెలెక్టెడ్‌ డిస్పోసబుల్‌ సైట్స్‌ ఆఫ్‌ నిజమాబాద్‌ సిటీ – డైరెక్షన్స్‌ టు సస్టేనబుల్‌ సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్‌ మెంట్‌ ఇన్‌ నిజామాబాద్‌ సిటీ ఇన్‌ తెలంగాణ స్టేట్‌” ...

Read More »

జీవన భృతి కోసం కోటగిరిలో ధర్నా

బోధన్‌, జనవరి 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం బీడీలు చేసే ప్రతి ఒక్కరికి 2016 రూపాయల జీవన భతి ఇవ్వాలని తెలంగాణ ప్రగతి శీల బీడీ వర్కర్స్‌ యూనియన్‌ (ఐఎఫ్‌టీయూ) ఆధ్వర్యంలో నిజామాబాద్‌ జిల్లా కోటగిరి మండల కేంద్రంలో ఏంపీడీవో కార్యాలయం ముందు బీడీ కార్మికులతో సోమవారం ధర్నా చేపట్టారు. కార్మికులు ధరఖాస్తు ఫారాలను సమర్పించారు. ఈ సందర్భంగా యూనియన్‌ జిల్లా కార్యదర్శి బి మల్లేష్‌ మాట్లాడుతూ ఎన్నికల్లో సీఎం కేసీఆర్‌ టీఆర్‌ఎస్‌ పార్టీకి ...

Read More »

కాకుల తో కొత్త రోగం

హైదరాబాద్‌, జనవరి 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారత్‌కు కరోనాతో పాటు మరో వైరస్‌తో ప్రమాదం పొంచి ఉందని, కేంద్రం అన్నీ రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేసింది. కాకుల నుంచి బర్డ్‌ఫ్లూ వైరస్‌ సోకే ప్రమాదం ఉందని అలర్ట్‌ చేసింది. ఇటీవల రాజస్థాన్‌లో వరుసగా కాకులు చనిపోతున్నాయి. దీంతో అప్రమత్తమైన ఆరోగ్యశాఖ అధికారులు చనిపోయిన కాకుల్ని టెస్ట్‌ చేయగా చనిపోయిన కాకుల్లో బర్డ్‌ ఫ్లూ వైరస్‌ను గుర్తించినట్లు రాజస్థాన్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ కుంజీ లాల్‌ మీనా తెలిపారు.

Read More »

వేతన ఒప్పందాన్ని అమలు చేయాలి

నిజామాబాద్‌, జనవరి 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సోమవారం ఏఐటియుసి ఆధ్వర్యంలో సివిల్‌ సప్లై హమాలి యూనియన్‌ వేతన ఒప్పందం అమలు చేయాలని నిజామాబాద్‌ నగరంలో మున్సిపల్‌ కార్పొరేషన్‌ నుండి కలెక్టరేట్‌ వరకు ప్రదర్శన నిర్వహించి కలెక్టర్‌కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ నిజామాబాద్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి ఓమయ్య మాట్లాడుతూ సివిల్‌ సప్లై హమాలీల స్వీపర్ల గత వేతన ఒప్పందం 2019 డిసెంబర్‌ 31తో ముగిసినా 2020 జనవరి ఒకటో తేదీ నుంచి నూతన వేతన ఒప్పందం ...

Read More »