Breaking News

కోనసీమను తలదన్నే విధంగా తెలంగాణలో నాట్లు

ఆర్మూర్‌, జనవరి 4

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కోనసీమను తలదన్నే విధంగా తెలంగాణలో నాట్లు పడుతున్నాయని రాష్ట్ర రోడ్లు భవనాలు శాసనసభ వ్యవహారాల శాఖ మాత్యులు వేముల ప్రశాంత్‌ రెడ్డి అన్నారు. సోమవారం బాల్కొండ నియోజకవర్గంలోని వేల్పూర్‌, ఏర్గట్ల, ముప్కాల్‌ మండలాల్లో పలు అభివద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు.

వెంకటాపూర్‌- రామన్నపేట మధ్య రూ. 6.65 కోట్లతో నిర్మించే పెద్ద వాగుపై చెక్‌ డ్యామ్‌ పనులకు శంకుస్థాపన, ఏర్గట్ల మండల కేంద్రంలో రూ. 22 లక్షల వ్యయం తో నిర్మించిన రైతు వేదిక ప్రారంభోత్సవం, నూతన కేజిబివి. కస్తూర్బా గాంధీ స్కూల్‌ నిర్మాణ పనులకు శంకుస్థాపన, ముప్కాల్‌ మండలంలో వెంచిర్యాల్‌ గ్రామంలో రూ 1.00 కోటితో నూతన సబ్‌స్టేషన్‌ పనులు శంకుస్థాపన, మండల కేంద్రంలో రూ. 3.50 కోట్లతో నూతనంగా మంజూరైన కేజీబీవీ కస్తూరిబా గాంధీ స్కూల్‌ భూమి పూజ శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు.

అనంతరం మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్‌ ప్రజలకు పాలన అందుబాటులో ఉండాలని రాష్ట్ర వ్యాప్తంగా కొత్త మండలాలు చేయడం జరిగిందన్నారు. అందులో భాగంగా బాల్కొండ నియోజకవర్గంలో ముందు ఐదు మండలాలు ఉండేవని మండలాలు పెంచి ఎనిమిది చేయడం జరిగిందన్నారు. కొత్త రెండు మండలాలలో కేజీబీవీ స్కూల్స్‌ రెండు ఇవ్వాలని శంకుస్థాపన చేసుకుందామన్నారు.

కొత్త మండలాలు ఏర్పాటు కాకుంటే ఈ స్కూల్స్‌ ఇక్కడికి వచ్చేవి కాదన్నారు. కొత్త మండలాల్లోని ఆరు గ్రామాలకు ఒక్కో కేజిబివి స్కూల్‌ ఏర్పాటు ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. గతంలో 23 గ్రామాలకు ఒక కేజీబీవీ స్కూలు ఉండేదన్నారు. ముఖ్యమంత్రి చేసిన పని ఫలాలు ఎంత దూరదష్టితో చేసిండ్రు, ఇవాళ మనకు అర్థం అవుతుందన్నారు. ప్రజల సౌకర్యం కోసం అందుబాటులో కార్యాలయాలు ఉండాలని తహసిల్దార్‌, ఎంపీడీవో, పోలీస్‌ స్టేషన్‌ ఉండాలని ఆలోచనతో కొత్త మండలాలు కొత్త జిల్లాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి వచ్చే నిధులు ఎలాగోలా వస్తాయన్నారు. ముఖ్యమంత్రి ఎవరు అడిగినా అడగకున్నా తెలంగాణ తెచ్చిన వారు కాబట్టి తెలంగాణ కోసం ప్రాణ త్యాగానికి సిద్ధపడి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన నాయకుడు కాబట్టి ప్రతి గ్రామం ప్రతి రైతు బాగుండాలనే ఆలోచన చేసి కార్యక్రమాలు తీసుకుపోతున్నాడు, రైతును పట్టిపీడిస్తున్న కరెంటు సమస్య తొలగిపోయిందని 24 గంటల కరెంటు వస్తున్నదని, రబీ పంటకాలం ఇంతకుముందు పడాఉండేది ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు. కారణం 24 గంటల కరెంటు అన్నారు.

బోర్లలో నీళ్లు రావడం లక్ష్మీ కెనాల్‌ పోయిన సంవత్సరం 300 రోజులు నడిపించడం జరిగిందని ఇప్పటికీ లక్ష్మి కెనాల్‌ పారుతుందని, బాల్కొండ నియోజకవర్గంలో కప్పల వాగు పెద్దవాగు 42 కిలోమీటర్లు ఉన్న దాన్ని ఉపయోగించుకోవాలని ఆలోచన చేసి కప్పల వాగు పెద్దవాగు మీద చెక్‌డ్యాంలు కట్టుకుంటే వర్షాలు పడి వాగు నీళ్ల ద్వారా అటు ఇటు రెండు కిలోమీటర్లలో ఉన్న బోర్లలో నీళ్లు వస్తాయని ఆలోచన చేసి కట్టడం మొదలు పెట్టిన ఇప్పటికే 9 పూర్తి అయినవని, మూడు పనులు నడుస్తున్నవి, ఇంకా ఆరు మొదలుపెడతామని మొత్తం 24 కట్టాలని ప్రణాళిక చేసుకొని ఎల్లప్పుడూ నీళ్లతో ఉండాలని ఆ కళ తొందరలో సాకారం కాబోతుందన్నారు.

రైతులకు కావలసిన కరెంటు, నీళ్లు, ఎరువులు, విత్తనాలు, పంట పెట్టుబడి సాయం ముఖ్యమంత్రి చేస్తున్నాడని తెలిపారు. అనంతరం వెంకటాపురం గ్రామంలో వెంకటేశ్వర స్వామి దేవాలయం దర్శనం చేసుకున్నారు. కార్యక్రమంలో వెంకటాపురం సర్పంచ్‌ మహేష్‌, ఏర్గట్ల సర్పంచ్‌ లావణ్య, తహసీల్దార్‌ సురేష్‌, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు ప్రభాకర్‌ రెడ్డి, డిఎవో గోవింద్‌, జడ్పీ సీఈవో గోవింద్‌, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

Check Also

మంత్రి కెటిఆర్‌ వల్లే ఇంత అభివృద్ధి

ఆర్మూర్‌, ఏప్రిల్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాల్కొండ నియోజకవర్గం భీంగల్‌ మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాల‌లో ...

Comment on the article