Breaking News

నీటి పారుదల రంగాన్ని అభివృద్ధి బాటలో తీసుకెళ్ళాలి

బాన్సువాడ, జనవరి 4

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా బాన్సువాడ డివిజన్‌ నీటి పారుదల శాఖ సూపరింటెండ్‌ ఇంజినీర్‌ కార్యాలయాన్ని కామారెడ్డి జిల్లా చీఫ్‌ ఇంజినీర్‌ టి. శ్రీనివాస్‌తో కలిసి ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా డీసీసీబీ చైర్మన్‌ పోచారం భాస్కర్‌ రెడ్డి సోమవారం ప్రారంభించారు.

కామారెడ్డి జిల్లా నూతన చీఫ్‌ ఇంజినీర్‌గా మరియు బాన్సువాడ ఇంచార్జ్‌ ఎస్‌.ఈ.గా నియమితులై ఛార్జి తీసుకున్న టి. శ్రీనివాస్‌ని శాలువతో సత్కరించి, వారికి స్వాగతం పలికారు. డివిజన్‌లో వారికి అన్ని విధాలుగా రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస్‌ రెడ్డి సూచనలతో, సహాయ సహకరాలతో బాన్సువాడ డివిజన్‌ నీటి పారుదల రంగాన్ని మరింత అభివద్ధి బాటలో తీసుకువెళ్లాలని, రైతాంగానికి ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ చివరి ఆయకట్టు వరకు సాగు నీరు చేరేలా చర్యలు చేపట్టాలని సూచించారు.

ఈ సందర్భంగా సభాపతి పోచారం శ్రీనివాస్‌ రెడ్డితో పాటు తమ నాయకుల సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని తెలిపారు. కార్యక్రమంలో కామారెడ్డి రైతు బంధు అధ్యక్షులు అంజిరెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ గంగాధర్‌, ఎంపీపీ వెంకట్‌ రాం రెడ్డి, డీసీసీబీ డైరెక్టర్‌ సంగ్రామ్‌ నాయక్‌, మార్కేట్‌ కమిటీ చైర్మన్‌ బాలకృష్ణ, ఈ.ఈ. బన్సీలాల్‌, డి.ఈ.ఈ. రవి కుమార్‌, దత్తత్రి, మండల పార్టీ అధ్యక్షులు మోహన్‌ నాయక్‌, మాజీ ఎంపీపీ ఏజాజ్‌, ఉమ, బాడీ శ్రీనివాస్‌, ఏ.ఈ. శ్రీనివాస్‌, సింధు, గజానంద్‌, బాసిద్‌, రాజ్‌ కమల్‌, శివ ప్రసాద్‌ పాల్గొన్నారు.

Check Also

అభివృద్ధి పనులు పరిశీలించిన స్పీకర్‌

బాన్సువాడ, జనవరి 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ పట్టణంలో జరుగుతున్న అభివద్ధి పనులను ప్రజాప్రతినిధులు, అధికారులతో ...

Comment on the article