Breaking News

Daily Archives: January 7, 2021

నగర అభివృద్ధికి పలు తీర్మానాలు

నిజామాబాద్‌, జనవరి 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ నగరంలోని న్యూ అంబేద్కర్‌ భవన్‌లో మున్సిపల్‌ సర్వసభ్య సమావేశం నగర మేయర్‌ నీతూ కిరణ్‌ అధ్యక్షతన గురువారం ఏర్పాటు చేశారు. సమావేశానికి నగర శాసన సభ్యులు బిగాల గణేష్‌ గుప్త, రూరల్‌ శాసన సభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్‌, ఆర్మూర్‌ శాసన సభ్యులు జీవన్‌ రెడ్డి, ఏమ్మెల్సీ వి.జి. గౌడ్‌, డి. రాజేశ్వర్‌, డిప్యూటీ మేయర్‌ ఇద్రిస్‌ ఖాన్‌, కార్పొరేటర్లు, మున్సిపల్‌ కమిషనర్‌ జితేశ్‌. వి. పాటిల్‌ పాల్గొన్నారు. సర్వసభ్య సమావేశంలో వివిధ ...

Read More »

న్యాక్‌ సెంటర్‌తో యువతకు లబ్ది

నిజామాబాద్‌, జనవరి 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : న్యాక్‌ సెంటర్‌ ఏర్పాటు వలన యువతకు లబ్ధి చేకూరుతుందని రాష్ట్ర రోడ్లు మరియు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని దుబ్బ బైపాస్‌లో నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ కన్స్ట్రక్షన్‌ సంస్థ రూ. 6 కోట్లతో స్కిల్‌ డెవలప్మెంట్‌ సెంటర్‌ ఏర్పాటుకు జిల్లా కలెక్టర్‌ సి నారాయణ రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే గణేష్‌ గుప్తా అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ...

Read More »

వేయి రెసిడెన్షియల్‌ స్కూళ్లను ఏర్పాటు చేసిన ఘనత కెసిఆర్‌దే

ఆర్మూర్‌, జనవరి 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వేయి రెసిడెన్షియల్‌ స్కూళ్లను ఏర్పాటు చేసిన ఘనత సీఎం కేసీఆర్‌ దేననీ రాష్ట్ర రోడ్లు, భవనాలు, శాసనసభ వ్యవహారాల, హౌసింగ్‌ శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి అన్నారు. గురువారం మోర్తాడ్‌ మండల కేంద్రంలో వివిధ అభివద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలలో మంత్రి పాల్గొన్నారు. 2 కోట్ల 25లక్షలతో నిర్మించిన డిగ్రీ కళాశాల భవనం ప్రారంభించారు. 18 లక్షలతో నిర్మించిన పల్లె ప్రకతి వనానికి రిబ్బన్‌ కట్‌ చేసి ప్రారంభించారు. 22 లక్షలతో ...

Read More »

తహసీల్దార్‌ సస్పెండ్‌

కామారెడ్డి, జనవరి 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాజంపేట మండలం, కొండాపురం గ్రామ పంచాయతీ షేర్‌ శంకర్‌ తండా సర్వేనెంబర్‌ 278, 279 లోని ప్రభుత్వ భూములను ఐదుగురికి అక్రమ పట్టాదారు పాస్‌ పుస్తకాల మంజూరీలో రాజంపేట తహశీలుదారు కె.మోతీసింగ్‌ను సస్పెండ్‌ చేస్తూ కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌ ఉత్తర్వులు జారీ చేశారు. తహసిల్దార్‌ నిబంధనలకు విరుద్ధంగా జారీచేసిన పట్టాదారు పాసు బుక్కులను రద్దు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

Read More »

అభివృద్ధి పనులు ప్రారంభించిన మేయర్‌

నిజామాబాద్‌, జనవరి 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ నగరంలోని 47వ డివిజన్‌ సి ఫ్లెక్స్‌ వద్ద 10 లక్షల రూపాయల పట్టణ ప్రగతి నిధులతో చేపట్టే సీసీ డ్రైనేజీ పనులను స్థానిక కార్పొరేటర్‌ బద్దురి మదులతో కలిసి నగర మేయర్‌ దండునీతూ కిరణ్‌ ప్రారంభించారు. 56, 59వ డివిజన్ల మధ్య మక్కా మస్జీద్‌ వద్ద ఆర్‌.అండ్‌.బి నిధులతో చేపట్టే సీసీ రోడ్డు నిర్మాణ పనులను స్థానిక కార్పొరేటర్‌ బాబ్ల్యూ ఖాన్‌తో కలిసి మేయర్‌ ప్రారంబించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత ...

Read More »

ఫ్రంట్‌ లైన్‌ వర్కర్ల వివరాలు వెంటనే నమోదు చేయాలి

నిజామాబాద్‌, జనవరి 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కోవిడ్‌ వ్యాక్సిన్‌ను ముందుగా అందించే ఫ్రంట్‌ లైన్‌ వర్కర్ల పూర్తి వివరాలను గురువారం రాత్రి కల్లా కోవీడు పోర్టల్‌లో నమోదు చేయాలని జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి వైద్య ఆరోగ్య శాఖ, ఐసిడిఎస్‌ శాఖ అధికారులను ఆదేశించారు. గురువారం సెల్‌ కాన్ఫరెన్సు ద్వారా కలెక్టరేట్‌ నుండి సంబంధిత శాఖల అధికారులతో వ్యాక్సిన్‌కు 8 న డ్రై రన్‌, సంక్రాంతి తర్వాత వ్యాక్సినేషన్‌ పై మాట్లాడారు. ఈ నెల 8 న నిజామాబాద్‌ లోని ...

Read More »

కోవిడ్‌ టీకా పై అవగాహన కల్పించాలి

నిజామాబాద్‌, జనవరి 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరోనాపై స్వచ్చంద సంస్థలు యువత మీడియా ప్రభుత్వ సంస్థలు విస్తత ప్రచారం, అవగాహన వల్లనే ప్రజలు వైరస్‌ బారిన పడకుండా చాలా వరకు తమను తాము రక్షించుకున్నారని, ప్రస్తుతం టీకా వచ్చినందున అదే విధమైన అవగాహన కల్పించి ప్రతి ఒక్కరూ టీకా తీసుకోవడానికి ముందుకు వచ్చేలా ప్రచారం కల్పించాలని జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి పిలుపునిచ్చారు. కోవిడ్‌ పైన ప్రజలకు అవగాహన కల్పించటానికి హార్ట్‌ ఫుల్‌ యువర్స్‌ అనే స్వచ్చంద సంస్థ 16 ...

Read More »

తెలంగాణలో రెండు రోజులు వర్షాలు.. చలి కూడా పెరిగే ఛాన్స్‌..

హైదరాబాద్‌, జనవరి 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దక్షిణ దిశ నుంచి గాలులు కూడా వీస్తున్నాయి. ఈ ప్రభావంతో రాష్ట్రంలో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. తెలంగాణ రాష్ట్రానికి వర్ష సూచన ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు. బుధ, గురువారాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. క్రింద స్థాయి తూర్పు గాలులలో 0.9కిమీ ఎత్తు వరకు ఏర్పడిన అల్పపీడన ద్రోణి కర్ణాటక తీరం వద్ద ...

Read More »

తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ హిమా కోహ్లీ ప్రమాణ స్వీకారం

హైదరాబాద్‌, జనవరి 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ స్టేట్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ హిమా కోహ్లీ గురువారం ఉదయం ప్రమాణ స్వీకారం చేశారు. జస్టిస్‌ హిమా కోహ్లీతో రాష్ట్ర గవర్నర్‌ డాక్టర్‌ తమిళసై సౌందరరాజన్‌ ప్రమాణ స్వీకారం చేయించారు. జస్టిస్‌ హిమా కోహ్లీ తెలంగాణ స్టేట్‌ హైకోర్టు మొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తి కావడం విశేషం. ప్రమాణ స్వీకార కార్యక్రమం రాజ్‌ భవన్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. కార్యక్రమంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు, కేబినెట్‌ మంత్రులు, స్టేట్‌ హైకోర్టు ...

Read More »