Breaking News

తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ హిమా కోహ్లీ ప్రమాణ స్వీకారం

హైదరాబాద్‌, జనవరి 7

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ స్టేట్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ హిమా కోహ్లీ గురువారం ఉదయం ప్రమాణ స్వీకారం చేశారు. జస్టిస్‌ హిమా కోహ్లీతో రాష్ట్ర గవర్నర్‌ డాక్టర్‌ తమిళసై సౌందరరాజన్‌ ప్రమాణ స్వీకారం చేయించారు.

జస్టిస్‌ హిమా కోహ్లీ తెలంగాణ స్టేట్‌ హైకోర్టు మొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తి కావడం విశేషం. ప్రమాణ స్వీకార కార్యక్రమం రాజ్‌ భవన్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. కార్యక్రమంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు, కేబినెట్‌ మంత్రులు, స్టేట్‌ హైకోర్టు జడ్జీలు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. జస్టిస్‌ హిమా కోహ్లీ గతంలో ఢిల్లీ స్టేట్‌ హైకోర్టులో సీనియర్‌ జడ్జిగా పనిచేశారు.

Check Also

కరోనా ల‌క్షణాలు ఉన్నవారు ఇఎస్‌ఐ ఆసుపత్రిలో ఉచిత ఆర్‌టిపిసిఆర్‌ టెస్ట్‌ చేయించుకోవడం ఎలా?

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 1. ఉదయం 6:00 గంటల‌కు ఆధార్‌ కార్డ్‌ మరియు ...

Comment on the article