Breaking News

తెలంగాణలో రెండు రోజులు వర్షాలు.. చలి కూడా పెరిగే ఛాన్స్‌..

హైదరాబాద్‌, జనవరి 7

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దక్షిణ దిశ నుంచి గాలులు కూడా వీస్తున్నాయి. ఈ ప్రభావంతో రాష్ట్రంలో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. తెలంగాణ రాష్ట్రానికి వర్ష సూచన ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు. బుధ, గురువారాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది.

క్రింద స్థాయి తూర్పు గాలులలో 0.9కిమీ ఎత్తు వరకు ఏర్పడిన అల్పపీడన ద్రోణి కర్ణాటక తీరం వద్ద తూర్పు-మధ్య అరేబియన్‌ సముద్రం నుండి దక్షిణ కొంకణి మరియు గోవా మీదుగా దక్షిణ-మధ్య మహారాష్ట్ర వరకు విస్తరించి ఉంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో ప్రధానంగా ఆగ్నేయ/ దక్షిణ దిశ నుండి గాలులు వీస్తున్నాయి. దీంతో రాష్ట్రంలో చలి తీవ్రత కూడా ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ వివరించింది.

మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో గురువారం పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. శుక్ర, శనివారాల్లో ఒకటి రెండు చోట్ల తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. గురు, శుక్రవారాల్లో తెలంగాణ జిల్లాలలో ఒకటి రెండు ప్రదేశాలలో ఉదయం సమయంలో తేలికపాటి పొగమంచు ఏర్పడే అవకాశం ఉంది. ఇక మంగళవారం సంగారెడ్డి జిల్లా కోహీర్‌లో 10.9 డిగ్రీలు, కామారెడ్డి జిల్లా పిట్లంలో 11.7 డిగ్రీలు, కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లా గిన్నెధరిలో 11.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Check Also

కరోనా ల‌క్షణాలు ఉన్నవారు ఇఎస్‌ఐ ఆసుపత్రిలో ఉచిత ఆర్‌టిపిసిఆర్‌ టెస్ట్‌ చేయించుకోవడం ఎలా?

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 1. ఉదయం 6:00 గంటల‌కు ఆధార్‌ కార్డ్‌ మరియు ...

Comment on the article