Breaking News

రూర్బన్‌ పథకం పనులు వేగంగా పూర్తి చేయాలి

నిజామాబాద్‌, జనవరి 8

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రూర్బన్‌ పథకం పనులు వేగంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ సినారాయణ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని ప్రగతి భవన్‌ సమావేశ మందిరంలో రూర్బన్‌ పథకంపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎట్టి పరిస్థితిలో రూర్బన్‌ పథకం పనులు ఫిబ్రవరి నాటికి పూర్తి కావాలన్నారు. మార్చి 15 నాటికి బిల్లులు అందజేయాలన్నారు. కార్యక్రమంలో డిఆర్డిఓ శ్రీనివాస్‌, జడ్పీ సీఈవో గోవింద్‌, డిసిఓ సింహాచలం, ఆర్‌డబ్ల్యుఎస్‌ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Check Also

కోవిడ్‌ పేషంట్‌ల‌తో మాట్లాడిన కలెక్టర్‌

నిజామాబాద్‌, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆరోగ్య కార్యకర్తలు మీ ఇంటికి ప్రతిరోజు వస్తున్నారా మీకు ...

Comment on the article