నిజామాబాద్, జనవరి 11
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ నగరంలోని 1వ టౌన్ పోలీసు స్టేషన్ పరిధిలోని రైల్వే స్టేషన్ సమీపంలో భారీ మొత్తంలో గుట్కా స్వాధీనం చేసుకున్నట్టు టాస్క్ఫోర్సు సిఐ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పట్టుకున్న గుట్కా విలువ సుమారు లక్ష రూపాయల వరకు ఉంటుందని, ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్టు వెల్లడించారు.
సోమవారం నిజామాబాద్ పోలీసు కమిషనర్ కార్తికేయ ఉత్తర్వుల మేరకు టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ షాకేర్ అలీ, వారి సిబ్బంది 1వ టౌన్, 5వ టౌన్ పోలీసు స్టేషన్ పరిధి సమీపంలోని రెండు చోట్ల అక్రమంగా గుట్కా వున్నదని నమ్మదగిన సమాచారం మేరకు దాడులు నిర్వహించారు. సుమారు లక్ష రూపాయల విలువగల గుట్కా ప్యాకెట్లు పట్టుకున్నట్టు పోలీసు కమీషనర్ కార్తికేయ తెలిపారు.
నిందితుల వివరాలు
1. ఆర్ఎండి గుట్కా యజమాని, మొహమ్మద్ ఆరిఫ్ (40) 1వ టౌన్ పరిధికి చెందిన వ్యక్తి.
2. విమల్ గుట్కా యజమాని, మొహమ్మద్ అబ్దుల్ మాజిద్ (38) 5వ టౌన్ పరిధికి చెందిన వ్యక్తి.

Nizamabad News

Latest posts by Nizamabad News (see all)
- బోధన్ ప్రాంత ప్రజలు అలర్ట్ - April 19, 2021
- రెండు రోజుల్లో ఇద్దరి మృతి - April 19, 2021
- ఎక్కడివక్కడే… ఏమిటివి… - April 19, 2021