కామారెడ్డిలో 16న వ్యాక్సినేషన్‌

కామారెడ్డి, జనవరి 11

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సోమవారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. పి. చంద్రశేఖర్‌ కామారెడ్డి జిల్లాలో కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ ఏర్పాట్లపై అధికారులతో సమావేశం నిర్వహించారు. కామారెడ్డి జిల్లాలో కోవిడ్‌ 19 నివారణకు ఈనెల 16వ తేదీ నుండి వాక్సినేషన్‌ కార్యక్రమం ప్రారంభించడానికి ఏర్పాట్ల గురించి వైద్య ఆరోగ్య శాఖ ప్రోగ్రాం అధికారులు, డిప్యూటీ డిఎం హెచ్‌వోలతో సమీక్ష నిర్వహించారు.

16న ప్రభుత్వం సూచించిన కేంద్రాల్లో కోవిడ్‌ 19 ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌కు వాక్సినేషన్‌ చేయడం జరుగుతుందన్నారు. సమావేశంలో డాక్టర్‌ మోహన్‌ బాబు, డాక్టర్‌ శోభారాణి, డాక్టర్‌ అనిల్‌ కుమార్‌, డాక్టర్‌ శిరీష, డా. ఇదరిస్‌ ఘోరీ, డా.శ్రీనివాస్‌ డా .సుజయత్‌ అలీ పాల్గొన్నారు.

Check Also

విపత్తుశాఖ వారి మోబైల్‌ యాప్‌ ప్రారంభం

కామారెడ్డి, ఫిబ్రవరి 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విపత్తు శాఖ ద్వారా ప్రచురితమైన ...

Comment on the article