కామారెడ్డి, జనవరి 12
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సంస్కతి, సంప్రదాయాలను కాపాడుకునే విధంగా పండుగలు జరుపుకోవాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ సతీమణి పార్వతీ శరత్ అన్నారు. మంగళవారం కామారెడ్డి జిల్లా తెలంగాణ జాగతి ఆద్వర్యంలో స్థానిక గాంధీ గంజ్ ఆవరణలో నిర్వహించిన ముగ్గుల పోటీలకు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముగ్గుల పోటీలో పాల్గొన్న ప్రతీ ఒక్కరు విజేతలు అన్నారు.
ఇక్కడ వేసిన అన్ని ముగ్గులు చూపరులను ఆకట్టుకున్నాయన్నారు. పోటా పోటీగా ఒకరిని మించి ఒకరు ముగ్గులు వేశారని ప్రశంసించారు. బహుమతులు కేవలం ప్రోత్సహించడానికేనని ప్రతిభ ఉంటే ఎక్కడయినా విజేతలు కావచ్చు అని అన్నారు. దేశాభివద్ధిలో యువత ముందుండాలని సూచించారు. అంతకు ముందు మునిసిపల్ వైస్ చైర్మన్ ఇందుప్రియ మాట్లాడుతూ తెలంగాణ జాగతి ద్వారా ముగ్గుల పోటీలు నిర్వహించడం సంతోషకరమన్నారు. మహిళల అభ్యున్నతికి జాగతి అధ్యక్షురాలు కవిత ఎంతో కషి చేస్తున్నారన్నారు. జాగతి ద్వారా నిర్వహించే కార్యక్రమాలకు తమ సహకారం ఎప్పుడూ ఉంటుందని పేర్కొన్నారు.
ముగ్గుల పోటీలలో సుమారు 45 మంది మహిళలు పాల్గొన్నారు. విజేతలను కలెక్టర్ సతీమణి, మునిసిపల్ వైస్ చైర్మన్ నిర్ణయించగా వారికి అతిథుల చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. మొదటి బహుమతి పి.స్వప్న, చుక్కపూర్, రెండవ బహుమతి యన్.రూప కామారెడ్డి, మూడవ బహుమతి పి.లహరి రాజంపేటలు అందుకున్నారు. మరో 7 గురికి కన్సోలేషన్ బహుమతులు అందజేయగా, ముగ్గుల పోటీలో పాల్గొన్న ప్రతీ ఒక్కరికీ ప్రోత్సాహక బహుమతులు తెలంగాణ జాగతి ఆద్వర్యంలో అందజేశారు.
కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు చిట్టిమల్ల అనంత రాములు, మహిళ కన్వీనర్ బట్టు పద్మజ, స్థానిక కౌన్సిలర్ అపర్ణ ఆనంద్, జాగతి నాయకులు చక్రధర్, వంశీ, సత్యనారాయణ, అవుసుల రాజు, రమణారావు, పోషవ్వ, వెంకటేష్, వెంకటరెడ్డి, స్వామి గౌడ్, హరీష్, భైరయ్య, సంగా గౌడ్, రాజ్యలక్ష్మి, రాజు తదితరులు పాల్గొన్నారు.

Nizamabad News

Latest posts by Nizamabad News (see all)
- అధికారులతో జిల్లా కలెక్టర్ వీడియో కాన్ఫరెన్సు – పలు అంశాలపై సమీక్ష - March 2, 2021
- టీయూ ఐక్యూఎసీ డైరెక్టర్గా ఆచార్య కౌసర్ మహ్మద్ - March 2, 2021
- ‘‘డైరెక్ట్ టాక్సెస్’’ పుస్తకావిష్కరణ - March 2, 2021