26లోగా పాఠశాలలు సిద్దం చేయాలి

కామారెడ్డి, జనవరి 12

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వ, కస్తూరి భా, గురుకుల పాఠశాలలు, జూనియర్‌ కళాశాలలను జనవరి 26 లోగా సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ. శరత్‌ అధికారులను ఆదేశించారు. కామారెడ్డి జనహితలో మంగళవారం విద్యాశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఫిబ్రవరి 1న పాఠశాల, కళాశాలల తరగతులు ప్రారంభమవుతాయని చెప్పారు. మధ్యాహ్న భోజనం సంబంధించిన ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.

మూత్రశాలలు, మరుగుదొడ్లు శుభ్రంగా ఉండే విధంగా చూడాలన్నారు. తరగతి గదులను శుభ్రం చేయించి, ఫర్నిచర్‌ ఉండే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. బిసి, ఎస్సీ, ఎస్‌టి, మైనార్టీ గురుకుల పాఠశాలల్లో తరగతుల నిర్వహణ చేపట్టడానికి సిద్ధం చేయాలని కోరారు.

9,10వ తరగతుల నిర్వహణ ఉన్నందున విద్యార్థులు తరగతి గదుల్లో భౌతిక దూరం పాటించే విధంగా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. సమావేశంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ వెంకటేష్‌ ధోత్రే, జిల్లా అదనపు కలెక్టర్‌ పి.యాది రెడ్డి, జిల్లా విద్యాశాఖ అధికారి రాజు, అధికారులు పాల్గొన్నారు.

Check Also

ఆదర్శం సనత్‌ కుమార్‌ శర్మ

కామారెడ్డి, ఫిబ్రవరి 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వీ.టి ఠాకూర్‌ బ్లడ్‌ బ్యాంక్‌లో ...

Comment on the article