వ్యాక్సిన్‌పై ఎలాంటి అపోహలు లేవు

కామరెడ్డి, జనవరి 12

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 16 నుంచి కరోనా వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌ అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో టెలీ కాన్ఫరెన్సులో వైద్య అధికారులతో సమీక్ష నిర్వహించారు. వైద్య సిబ్బంది ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్‌ తీసుకునే విధంగా చూడాలన్నారు. ప్రజాప్రతినిధులతో వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని ప్రారంభించాలని సూచించారు.

జిల్లా స్థాయిలో, డివిజన్‌ స్థాయిలో కంట్రోల్‌ రూమ్‌లను ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. వ్యాక్సిన్‌పై ఎలాంటి అపోహలు లేవని స్పష్టం చేశారు. ప్రతి వ్యాక్సిన్‌ కేంద్రం వద్ద 30 నిమిషాల పాటు వ్యాక్సిన్‌ తీసుకున్న వ్యక్తులను పరిశీలనలో ఉంచాలని కోరారు. టెలికాన్పరెన్సులో అసిస్టెంట్‌ కలెక్టర్‌ హేమంత్‌ కేశవ పాటిల్‌, జిల్లా వైద్య అధికారి డాక్టర్‌ చంద్రశేఖర్‌, వైద్యులు పాల్గొన్నారు.

Check Also

విపత్తుశాఖ వారి మోబైల్‌ యాప్‌ ప్రారంభం

కామారెడ్డి, ఫిబ్రవరి 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విపత్తు శాఖ ద్వారా ప్రచురితమైన ...

Comment on the article