Breaking News

400 కోళ్ళు మృతి

డిచ్‌పల్లి, జనవరి 13

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా డిచ్‌పల్లి మండలం యానంపల్లి తాండా లోని దుర్గాభవాని బ్రాయిలర్‌ పౌల్ట్రీ ఫాంలో 12, 13వ తేదీల్లో 400 కోళ్ళు అకస్మాత్తుగా మృతి చెందినట్టు పౌల్ట్రీ యజమాని రాంచందర్‌ తెలిపారు. కాగా జిల్లా పశు వైద్య, పశు సంవర్ధకశాఖ అధికారి డాక్టర్‌ భరత్‌, జిల్లా వ్యాధి నిర్దారణ కేంద్రం, సహాయ సంచాలకులు డాక్టర్‌ కిరణ్‌ దేశ్‌ పాండు, స్థానిక పశు వైద్యాధికారి డాక్టర్‌ గోపికృష్ణ తన సిబ్బందితో కలిసి పౌల్ట్రీని సందర్శించారు.

పరీక్షలు నిర్వహించి కోళ్ల రక్త నమూనాలను రాష్ట్ర వ్యాధి నిర్దారణ కేంద్రం హైదరాబాద్‌కు పంపించారు. డాక్టర్‌ భరత్‌ మాట్లాడుతూ బర్డ్‌ ఫ్లూ లక్షణాలు కనపడడం లేదని, భయపడాల్సిన పనిలేదన్నారు. హైదరాబాద్‌ నుంచి రక్త నమూనాల రిపోర్టులు వచ్చిన తర్వాత వివరాలు తెలియజేస్తామని పేర్కొన్నారు.

Check Also

స్వీయ నియంత్రణ, మాస్కు దరించడమే శ్రీరామ రక్ష

కామారెడ్డి, ఏప్రిల్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కోవిడ్‌ నియంత్రణ, వ్యాక్సినేషన్‌పై జిల్లా కలెక్టర్‌ కార్యాల‌యంలోని జనహిత ...

Comment on the article