Breaking News

ఆపరేషన్‌ నిమిత్తమై మహిళకు రక్తదానం

కామారెడ్డి, జనవరి 13

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ నియోజకవర్గం నసురుల్లాబాదు మండలానికి చెందిన సావిత్రి 42 సంవత్సరాల మహిళకు ఆపరేషన్‌ నిమిత్తము అమ్రిత వైద్యశాల బాన్సువాడలో ఏబి పాజిటివ్‌ రక్తం అవసరమైంది. వారికి కావలసిన రక్తం బాన్సువాడలో దొరకక పోవడంతో వారి బంధువులు కామారెడ్డి రక్తదాతల నిర్వాహకుడు బాలును సంప్రదించారు. కాగా 2 యూనిట్ల రక్తాన్ని సకాలంలో అందజేసి ప్రాణాలు కాపాడారు.

అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారికి ఎల్లప్పుడూ రక్తం అందజేయడానికి సిద్ధంగా ఉన్నామని, గతంలో కూడ హైదరాబాద్‌, బాన్సువాడ, సిరిసిల్ల, రామాయంపేట, నిజామాబాద్‌ ప్రాంతాలకు చెందిన వారికి కావాల్సిన రక్తాన్ని సకాలంలో అందించి ప్రాణాలు కాపాడడం జరిగిందని తెలిపారు. కార్యక్రమంలో ఏసు గౌడ్‌, భాను ప్రకాష్‌, అఖిల్‌ రెడ్డి, సాయికుమార్‌, శేఖర్‌ తదితరులున్నారు.

Check Also

సీసీ రోడ్డు పనులు ప్రారంభం

కామారెడ్డి, ఫిబ్రవరి 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి 26 వార్డ్‌ లో సోమవారం మున్సిపల్‌ నిధులు ...

Comment on the article