చెడును భోగి మంటల్లో కాల్చివేయాలి

కామారెడ్డి, జనవరి 13

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : చెడును భోగి మంటల్లో కాల్చి వేసి మంచి మార్గంలో నడవాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ డా.శరత్‌ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని డిగ్రీ కళాశాల రాశి వనం సమీపంలో తెలంగాణ జాగతి ఆధ్వర్యంలో జాగతి వ్యవస్థాపక అధ్యక్షురాలు ఆదేశాల మేరకు నిర్వహించిన భోగి మంటలు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కలెక్టర్‌ హాజరయ్యారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన భోగికి పూజలు నిర్వహించి అగ్ని వెలిగించారు.

భోగి మంటలలో ప్రతి ఒక్కరు చెడును, స్వార్థాన్ని ఆహుతి చేసి మంచి అనే మార్గంలో నడవాలన్నారు. గత కాలపు చెడును, బాధలను, కష్టాలను భోగి మంటల్లో పడేసి, ఆనందకరమయిన కొత్త జీవితం అందరికీ లభించాలని, ఈశ్వర కపతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని అన్నారు. సాంప్రదాయ పద్దతిలో భోగి మంటలు, గంగిరెద్దులు ఏర్పాటు చేయడం పట్ల తెలంగాణ జాగతిని అభినందించారు. ఇలాగే ఇంకా ఎన్నో మంచి కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.

కలెక్టర్‌తో కలిసి పూజలు నిర్వహించిన వారిలో స్థానిక ఆర్‌డివో శ్రీను, తహసీల్దార్‌, జాగతి జిల్లా అధ్యక్షులు అనంత రాములు, ఇందు ప్రియ ఉన్నారు. కార్యక్రమంలో జాగతి నాయకులు బట్టు పద్మజ, సత్యనారాయణ, రమణా రావు, వంశీ కష్ణ, చక్రధర్‌, శ్రీరాం వెంకటేష్‌ , పోషవ్వ, స్వామి గౌడ్‌, హరీష్‌, శేఖర్‌, అవుసుల రాజు, పాల్తీ రాజు, జై హనుమాన్‌ యోగ గురూజీ గరిపల్లి అంజయ్య, ఎల్లంకి సుదర్శన్‌, రమేష్‌, ఇతర సభ్యులు పాల్గొన్నారు.

Check Also

విపత్తుశాఖ వారి మోబైల్‌ యాప్‌ ప్రారంభం

కామారెడ్డి, ఫిబ్రవరి 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విపత్తు శాఖ ద్వారా ప్రచురితమైన ...

Comment on the article