కామారెడ్డి, జనవరి 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎల్లారెడ్డి మున్సిపల్ కమిషనర్ వేతనం నుంచి ఆసరా పింఛన్ల డబ్బులు రికవరీ చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ ఆదేశించారు. శుక్రవారం కామారెడ్డి కలెక్టరేట్లో పట్టణ ప్రగతి, పల్లె ప్రగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎల్లారెడ్డి మున్సిపల్ కమిషనర్ నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల 33 మంది ఆసరా పింఛన్లు రద్దు అయినట్లు గుర్తించామన్నారు. ఈ ఘటనకు బాధ్యత వహించిన కంప్యూటర్ ఆపరేటర్‌ను విధుల నుంచి తొలగించినట్లు పేర్కొన్నారు. మూడు మున్సిపాలిటీలో ఇంటిగ్రేటెడ్ వెజిటేబుల్ ...
Read More »Daily Archives: January 15, 2021
వ్యాక్సినేషన్ ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్
నిజామాబాద్, జనవరి 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈనెల 16న కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రారంభానికి ఏర్పాటు చేస్తున్నందున నిజామాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి శుక్రవారం పర్యటించి పరిశీలించారు. గురువారం జిల్లా కేంద్రానికి చేరుకున్న 302 వాయిల్స్‌ను భద్రపరిచిన ప్రభుత్వ వైద్య కళాశాలలో పర్యటించారు. అనంతరం నిజామాబాద్ ప్రభుత్వం ఆసుపత్రిలో శనివారం ఏర్పాటు చేసే వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమం సందర్భంగా నిర్వహించే కార్యక్రమం సదుపాయాలను పరిశీలించారు. కలెక్టరేట్లో కోవిడ్ ఫిర్యాదుల కోసం ఏర్పాటుచేసిన కంట్రోల్ రూమ్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా వైద్య ...
Read More »జిల్లా వాసికి జీవన సాఫల్య పురస్కారం
నిజామాబాద్, జనవరి 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జగిత్యాల జిల్లా యువజన సంఘాల సమితి ప్రతి యేటా ఇచ్చే ప్రతిష్టాత్మకమైన జీవిత సాఫల్య పురస్కారానికి నిజామాబాద్ జిల్లాకు చెందిన ప్రముఖ జానపద కళాకారుడు ఆష్ట గంగాధర్ ఎంపికయ్యారు. జగిత్యాల జిల్లా యువజన సంఘాల సమితి అద్యక్ష కార్యదర్శులు బొడ్డు రాజేష్, అతిక్ ఈ మేరకు గంగాధర్‌కు లేఖ పంపారు. కళారంగంలో చేస్తున్న సేవలకు గాను గంగాధర్‌ను జీవిత సాఫల్య పురస్కారానికి ఎంపిక చేసినట్టు వారు లేఖలో పేర్కొన్నారు. స్వామి వివేకానంద జయంతి ...
Read More »