కామారెడ్డి, జనవరి 15
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎల్లారెడ్డి మున్సిపల్ కమిషనర్ వేతనం నుంచి ఆసరా పింఛన్ల డబ్బులు రికవరీ చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ ఆదేశించారు. శుక్రవారం కామారెడ్డి కలెక్టరేట్లో పట్టణ ప్రగతి, పల్లె ప్రగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎల్లారెడ్డి మున్సిపల్ కమిషనర్ నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల 33 మంది ఆసరా పింఛన్లు రద్దు అయినట్లు గుర్తించామన్నారు.
ఈ ఘటనకు బాధ్యత వహించిన కంప్యూటర్ ఆపరేటర్‌ను విధుల నుంచి తొలగించినట్లు పేర్కొన్నారు. మూడు మున్సిపాలిటీలో ఇంటిగ్రేటెడ్ వెజిటేబుల్ మార్కెట్ కోసం స్థలాన్ని ఎంపిక చేయాలని కమిషనర్లను ఆదేశించారు. అవెన్యూ ప్లాంటేషన్‌లో మొక్కలు ఎండిపోకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. ఎల్లారెడ్డిలో అసంపూర్తిగా ఉన్న మరుగుదొడ్లను పూర్తిచేయాలని కోరారు. పల్లె ప్రకతి వనాలు, కంపోస్టు షెడ్లను వినియోగంలోకి తీసుకురావాలని ఆదేశించారు.
ఉపాధి హామీ పనులకు కూలీలు అధికంగా వచ్చే విధంగా చూడాలన్నారు. స్మశాన వాటికలు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. మున్సిపల్లో స్మశాన వాటికల నిర్మాణం చేపట్టాలని పేర్కొన్నారు.
సమావేశంలో అదనపు కలెక్టర్ పి.యాదిరెడ్డి, జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, డిఆర్డిఓ చంద్రమోహన్ రెడ్డి, ఆర్డీవోలు శీను, రాజా గౌడ్, ఇన్చార్జి డీపీవో సాయన్న, కామారెడ్డి మున్సిపల్ కమిషనర్ దేవేందర్, బాన్సువాడ మున్సిపల్ కమీషనర్ రమేష్, ఎల్లారెడ్డి మున్సిపల్ కమిషనర్ ఖమర్ అహ్మద్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Nizamabad News

Latest posts by Nizamabad News (see all)
- అధికారులతో జిల్లా కలెక్టర్ వీడియో కాన్ఫరెన్సు – పలు అంశాలపై సమీక్ష - March 2, 2021
- టీయూ ఐక్యూఎసీ డైరెక్టర్‌గా ఆచార్య కౌసర్ మహ్మద్ - March 2, 2021
- ‘‘డైరెక్ట్ టాక్సెస్’’ పుస్తకావిష్కరణ - March 2, 2021