బలహీన వర్గాలకు అండగా ప్రభుత్వం

కామారెడ్డి, జనవరి 16

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బలహీన వర్గాల అభివద్ధి లక్ష్యంగా కేసీఆర్‌ ప్రభుత్వం పనిచేస్తున్నదని, బడుగుల జీవితాల్లో వెలుగు నింపేందుకు అనేక సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టిందని రాష్ట్ర ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ అన్నారు. శనివారం ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా కామారెడ్డిలో స్థానిక శాసన సభ్యులు, ప్రభుత్వ విఫ్‌, గంప గోవర్ధన్‌ నివాసంలో పెరికకుల ఎంప్లాయిస్‌ అండ్‌ ప్రొఫెషనల్స్‌ సొసైటీ ఆఫ్‌ ఇండియా (పెరికకుల సంఘం) 2021 వార్షిక క్యాలెండర్‌ ఆవిష్కరించారు.

అనంతరం మాట్లాడుతూ బిసిలకు, ఎంబిసిలకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టి, ప్రతి కులానికి ఆత్మగౌరవ భవనాలు నిర్మించేందుకు స్థలం, నిధులు కేటాయించారని, గంప గోవర్ధన్‌ అన్నారు.

కార్యక్రమంలో పెరికకుల ఎంప్లాయిస్‌ అండ్‌ ప్రొఫెషనల్స్‌ సొసైటీ అప్‌ ఇండియా (పెప్సీ) వ్యవస్థాపక అధ్యక్షుడు డా.సంగని మల్లేశ్వర్‌, రాష్ట్ర నాయకులు డా. గుమ్మళ్ల కౌలయ్య, మైదం రాజన్న, సందేల లింగన్న బుద్దే సుదర్శన్‌, నల్లపు శ్రీనివాస్‌, అప్పల రాజు, చిరంశెట్టి ప్రభాకర్‌, భాస్కర్‌, శ్రీరాం వీరయ్య, బోళ్ల వీర ప్రతాప్‌, అచ్చ పరమేశ్వర్‌, శ్రీధర్ల ఈశ్వర్‌ కుమార్‌, అప్పని సతీష్‌ కుమార్‌, మేడిశెట్టి శ్రీనివాసరావు, మీసా కుమార్‌ స్వామి, కోశాధికారి దాసరి అశోక్‌, నాయకులు, సత్యనారాయణ, వీరన్న, బోళ్ల లవయ్య, అత్తె రవీందర్‌, బోళ్ల కొంరెల్లి, శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

విపత్తుశాఖ వారి మోబైల్‌ యాప్‌ ప్రారంభం

కామారెడ్డి, ఫిబ్రవరి 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విపత్తు శాఖ ద్వారా ప్రచురితమైన ...

Comment on the article