భక్తులతో కిట కిటలాడిన లింబాద్రి గుట్ట

భీమ్‌గల్‌, జనవరి 16

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భీంగల్‌ పట్టణంలో ప్రముఖ పుణ్యక్షేత్రం అయిన శ్రీ నింబాచల క్షేత్రం శనివారం ఉదయం 6 గంటల నుండి దర్శనాల రద్దీ ప్రారంభం అయింది. కరోన తర్వాత రోజు రోజు భక్తుల తాకిడి పెరుగుతూ ఉంది. శనివారం ఉదయం నుండి స్వామి వారి దర్శనం కోసం భక్తులు బారికేడ్ల మధ్య కూర్చొని వేచి చూసారు.

6 గంటల తరవాత గుడి తెరుచుకోగానే భక్తులు స్వామివారిని దర్శనం చేసుకున్నారు. అనంతరం భక్తులకు దేవస్తానం వారు ఏర్పాటు చేసిన అల్పాహారం (పులిహోర) అన్నదాన కార్యక్రమంలో పాలు పంచుకొని స్వామి వారి మొక్కులు తీర్చుకున్నారు.

Check Also

ముగిసిన బ్రహ్మోత్సవాలు

మోర్తాడ్‌, మార్చ్‌ 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మోర్తాడ్‌ మండల‌ కేంద్రంలో గత వారం రోజుల‌ నుండి ...

Comment on the article