31 లోగా పూర్తిచేయాలి

కామారెడ్డి, జనవరి 16

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మిషన్‌ భగీరథ పైపులైను పనులను ఈనెల 31లోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో శనివారం మిషన్‌ భగీరథ పథకం పనులపై మండలాల వారీగా అధికారులతో సమీక్ష చేశారు.

అధికారులు ఎలాంటి పెండింగ్‌ లేకుండా నిర్ణీత సమయంలో పనులు పూర్తి చేయాలని, తాగునీటి వసతికి అన్ని చర్యలు తీసుకోవాలని, అలసత్వం వహిస్తే చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో మిషన్‌ భగీరథ ఎస్‌ఈ లక్ష్మీనారాయణ, డీఈలు, ఎఈలు పాల్గొన్నారు.

Check Also

విపత్తుశాఖ వారి మోబైల్‌ యాప్‌ ప్రారంభం

కామారెడ్డి, ఫిబ్రవరి 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విపత్తు శాఖ ద్వారా ప్రచురితమైన ...

Comment on the article