Breaking News

నర్సరీలలో మొక్కలు సంరక్షించాలి

గాంధారి, జనవరి 16

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నర్సరీలలో పెంచుతున్న మొక్కలను సంరక్షించాలని కామారెడ్డి ఏపిడి, ఇంచార్జ్‌ డిపిఓ సాయన్న అన్నారు. శనివారం గాంధారి మండలకేంద్రంలో నర్సరీని అయన పరిశీలించారు. ఈ సందర్బంగా సీడ్‌ దిబ్లింగ్‌ ట్రైనింగ్‌ కార్యక్రమాన్ని నిర్వహించగా దానిని తిలకించారు. మొక్కలు పెంచే క్రమంలో వాటి విత్తనాలు నాణ్యతగా ఉండేలా చూడాలన్నారు. మొక్కలకు ఎప్పటికప్పుడు నీటిని అందించాలని సూచించారు.

స్థానిక ప్రజాప్రతినిధులు నర్సరీల బాధ్యతలు స్వీకరించి వాటిని కాపాడే విధంగా చూడాలన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ శంకర్‌ నాయక్‌, ఎంపీపీ రాధా బలరాం, స్థానిక సర్పంచ్‌ సంజీవ్‌ యాదవ్‌, ఎంపీటీసీలు పత్తి శ్రీనివాస్‌, తూర్పు రాజు, కామెల్లి బాలరాజ్‌, ఎంపీడీఓ సతీష్‌ ఉపాధి హామీ సిబ్బంది ఉన్నారు.

Check Also

రైతు సేవా కేంద్రం ప్రారంభం

బాన్సువాడ, డిసెంబర్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కోటగిరి మండల హెగ్డోలి గ్రామంలో నూతనంగా స్థాపించిన ”ఆగ్రోస్‌ ...

Comment on the article