కామారెడ్డి, జనవరి 16
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శ్రీరామాజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో శనివారం శ్రీరామ నామ సంకీర్తన శోభయాత్ర కామారెడ్డి సరస్వతి శిశుమందిర్ నుండి ప్రారంభమై పట్టణంలోని పుర వీధుల గుండా నిర్వహించారు. శోభాయాత్ర ప్రారంభానికి ముందు శిశుమందిర్ లో జరిగిన సభలో ముఖ్య అధితిగా విచ్చేసిన సోమయప్ప స్వామిజి మాట్లాడుతూ తరతరాల నుండి కలలు కన్న భవ్య రామ మందిర నిర్మాణం జరుగుతున్న నేపథ్యంలో ప్రతి హిందూ బంధువు దగ్గరకి రామ భక్తులు వెళ్లి నిధి సేకరించడం ఆనందదాయకమని జిల్లా లోని ప్రతి కుటుంబాన్ని కలవడానికి ట్రస్ట్ వాళ్ళు ప్రయత్నిస్తున్నారని అన్నారు.
అయోధ్యలో రామమందిరం నిర్మాణానికి సేవా సంస్థలు, వివిధ పారిశ్రామిక వర్గాల నుంచి నిధులు తీసుకోకుండ ఆలయ నిర్మాణానికి ఖర్చయ్యే సుమారు 14 వందల కోట్లను దేశంలోని ఏడున్నర లక్షల గ్రామాలలో గల 11 కోట్ల హిందు బంధువుల కుటుంబాల నుంచి నిధిని సేకరించడానికి జనజాగరణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. అందులో భాగంగా శనివారం జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించడం జరిగిందని తెలిపారు.
కామారెడ్డి అంబేడ్కర్ బస్తీకి సంబంధించిన పది మంది సోదరులు ఒక్కొక్కరు వంద రూపాయల చొప్పున ఇచ్చి రసీదు తీసుకొని జిల్లాలో మొట్టమొదటి నిధి సమర్పణ చేశారు. అనంతరం మంత్రోఛ్ఛరణల తర్వాత జండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. సుమారు మూడు వేలకు పైగా హిందువులు ర్యాలీలో పాల్గొన్నారు.
జిల్లా కేంద్రంలోని సరస్వతి శిశుమందిర్ నుంచి మొదలుకొని కొత్త బస్టాండ్, నిజాంసాగర్ చౌరస్తా, ఇందిరా చౌక్, గాంధీ గంజ్, అశోక్ నగర్ల మీదుగా తిరిగి సరస్వతి శిశుమందిర్ వరకు సుమారు 7 కిలోమీటర్ల భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో చిన్నారులు శ్రీరాముడు, హనుమంతుని ప్రత్యేక వేషధారణలో అలరించారు. అలాగే చిన్నారులు చేసిన ప్రత్యేక కోలాటాలు, నత్యాలు అందరిని అలరించాయి. సంగోజివాడి, లింగంపల్లి గ్రామాల నుంచి వచ్చిన కళాకారుల ప్రత్యేక కోలాటాలు చూపరులను ఆకట్టుకున్నాయి. ర్యాలీ సందర్బంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Nizamabad News

Latest posts by Nizamabad News (see all)
- అధికారులతో జిల్లా కలెక్టర్ వీడియో కాన్ఫరెన్సు – పలు అంశాలపై సమీక్ష - March 2, 2021
- టీయూ ఐక్యూఎసీ డైరెక్టర్గా ఆచార్య కౌసర్ మహ్మద్ - March 2, 2021
- ‘‘డైరెక్ట్ టాక్సెస్’’ పుస్తకావిష్కరణ - March 2, 2021