Breaking News

రక్తదానం చేసిన యువకుడు

కామారెడ్డి, జనవరి 16

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి మండలం చిన్న మల్లారెడ్డికి చెందిన అంజయ్యకు హైదరాబాదులోని యశోదా వైద్యశాలలో బి పాజిటివ్‌ రక్తం అవసరం కావడంతో బిబీపేట్‌ గ్రామానికి చెందిన ఉప్పు కష్ణ సకాలంలో రక్తాన్ని అందజేయడం జరిగిందని కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకులు బాలు తెలిపారు.

ఆపదలో ఉన్న వారికి రక్తాన్ని అందజేయడానికి కామారెడ్డి రక్తదాతల సమూహం ఎల్లప్పుడూ ముందు ఉంటుందని రక్తదానానికి ముందుకు వచ్చిన కష్ణను అభినందించారు. ఈ కార్యక్రమంలో సురేష్‌ పాల్గొనడం జరిగింది.

Check Also

సీసీ రోడ్డు పనులు ప్రారంభం

కామారెడ్డి, ఫిబ్రవరి 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి 26 వార్డ్‌ లో సోమవారం మున్సిపల్‌ నిధులు ...

Comment on the article