టీఎస్‌ఐపాస్‌ అండ్‌ డిస్టిక్‌ ఇండస్ట్రీస్‌ ప్రమోషన్‌ కమిటీ సమావేశం

నిజామాబాద్‌, జనవరి 18

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : టీఎస్‌ఐపాస్‌ అండ్‌ డిస్టిక్‌ ఇండస్ట్రీస్‌ ప్రమోషన్‌ కమిటీ పై జిల్లా కలెక్టర్‌ సి నారాయణ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. సోమవారం జిల్లా కలెక్టర్‌ తన క్యాంపు కార్యాలయంలో టీఎస్‌ఎస్‌ఐ పాస్‌ జిల్లా ఇండస్ట్రీస్‌ ప్రమోషన్‌ కౌన్సిల్‌ సమీక్ష సందర్భంగా అధికారులతో మాట్లాడుతూ టీఎస్‌ ఐపాస్‌ కింద మంజూరు చేసిన ఎస్‌సి పెట్టుబడి సబ్సిడీ కింద మైక్రో యూనిట్స్‌ ఎస్సీ 12 పారిశ్రామిక వేత్తలకు సబ్సిడీ కింద రవాణా రంగంలో మోటార్‌ క్యాబ్‌ 1 గూడ్స్‌ క్యారియర్‌ 2 ట్రాక్టర్స్‌ ట్రైలర్స్‌ 9 మంజూరుకు సమావేశంలో ఆమోదించడం జరిగిందన్నారు.

ఎస్‌టి లకు శాంక్షన్‌ అయిన ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు 11 మందికి రవాణా రంగంలో ట్రాక్టర్స్‌ ట్రైలర్స్‌ శాంక్షన్‌ ఆమోదించనైనదన్నారు. కార్యక్రమంలో జిఎం ఇండస్ట్రీస్‌ బాబురావు, ఎల్‌డిఎం జయ సంతోషి టిఎస్‌ ఎస్‌ఎఫ్‌సి అనిల్‌, ఎస్‌సి కార్పొరేషన్‌ ఈడి రాజేశ్వరి, ఈఈ పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు బిక్షపతి తదితరులు పాల్గొన్నారు.

Check Also

నేరాల‌ శాతం తగ్గించాలి

నిజామాబాద్‌, ఫిబ్రవరి 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సోమవారం హైదరాబాద్‌ నుండి తెలంగాణ రాష్ట డి.జి.పి ఎమ్‌. ...

Comment on the article