Breaking News

Daily Archives: January 21, 2021

సీతారామ ప్రాజెక్టు పనులు వేగవంతం చేయాలి

హైదరాబాద్‌, జనవరి 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేసే సీతారామ ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌ రావు అధికారులను ఆదేశించారు. కొత్త ఆయకట్టును సష్టించడంతో పాటు, నాగార్జున సాగర్‌ ఆయకట్టును కూడా కలుపుకుని పది లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ప్రాజెక్టును అత్యంత ముఖ్యమైనదిగా భావించాలని సీఎం అన్నారు. సీతారామ ప్రాజెక్టు పనుల పురోగతిపై ముఖ్యమంత్రి గురువారం ప్రగతి భవన్‌లో సమీక్ష నిర్వహించారు. మంత్రులు పువ్వాడ అజయ్‌ కుమార్‌, వేముల ప్రశాంత్‌ ...

Read More »

పెండింగ్‌ ముటేషన్‌లు త్వరగా పూర్తిచేయాలి

కామారెడ్డి, జనవరి 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ధరణిలో ఉన్న పెండింగ్‌ ముటేషన్‌లను త్వరిత గతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ. శరత్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లోని జనహిత భవనంలో గురువారం ధరణి రిజిస్ట్రేషన్లపై సమీక్ష నిర్వహించారు. గ్రామస్థాయిలో వీఆర్‌ఏల ద్వారా రైతులకు అవగాహన కల్పించి స్లాట్‌ బుక్‌ చేసే విధంగా చూడాలని కోరారు. రైతుల పేర్లలో అక్షర దోషాలు ఉన్న వారు మీ సేవ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ పి.యాదిరెడ్డి, అసిస్టెంట్‌ ...

Read More »

ఫిబ్రవరి 1 నుంచి తరగతులు ప్రారంభం

జనవరి 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కేంద్ర మానవ వనరుల అభివద్ది సంస్థ, యూనివర్సిటి గ్రాంట్‌ కమిషన్‌, తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి, తెలంగాణ విశ్వవిద్యాలయం ఉపకులపతి, సీనియర్‌ ఐఎఎస్‌ ఆఫీసర్‌ నీతూ కుమారి ప్రసాద్‌, రిజిస్ట్రార్‌ ఆచార్య నసీం ఆదేశానుసారం తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని విభాగాలలో పీజీ కోర్సులకు ఫిబ్రవరి 1 వ తేదీ నుంచి భౌతికం (ఆఫ్‌ లైన్‌) గా చివరి సంవత్సరం తరగతులు ప్రారంభమవుతాయని తెలంగాణ విశ్వవిద్యాలయ కళాశాల ప్రధానాచార్యులు డా. వాసం చంద్రశేఖర్‌ పేర్కొన్నారు. ...

Read More »

కామ్రేడ్‌ వినోద సేవలు మరువలేనివిలి

నిజామాబాద్‌, జనవరి 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా నవీపేట్‌లో పివోడబ్ల్యు జిల్లా కమిటి సభ్యురాలు 18వ తేదీ తెల్లవారు ఝామున హార్ట్‌ ఎటాక్‌తో మరణించిన కామ్రేడ్‌ వినోద సంతాప సభను సీపీఐ (ఎం-ఎల్‌) న్యూ డెమోక్రసీ పార్టీ బోధన్‌ డివిజన్‌ కమిటీ ఆధ్వర్యంలో నవీపేట్‌లో నిర్వహించారు. మొదట ఆమె మతికి సంతాపంగా రెండు నిముషాలు మౌనం పాటించి నివాళులు అర్పించారు. సభలో తెలంగాణ ప్రగతి శీల బీడీ వర్కర్స్‌ యూనియన్‌ (ఐఎఫ్‌టీయూ) రాష్ట్ర అద్యక్షులు వనమాల కష్ణ, అఖిల ...

Read More »

భారీగా గుట్కా, జర్దా స్వాధీనం

బోధన్‌, జనవరి 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బోధన్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని న్యూ బస్టాండ్‌ సమీపంలో ఒక గోడౌన్‌, పోస్ట్‌ ఆఫీసు సమీపంలో రెండు హోల్‌ సెల్‌ షాపులలో గుట్క, జర్దా పట్టుకున్నట్టు నిజామాబాద్‌ టాస్క్‌ ఫోర్స్‌ పోలీసులు వెల్లడించారు. వీటి విలువ సుమారు సుమారు 5 లక్షల వరకు ఉంటుందని పేర్కొన్నారు. బుధవారం నిజామాబాద్‌ అదనపు పోలీసు కమిషనర్‌ అరవింద బాబు ఉత్తర్వుల మేరకు టాస్క్‌ ఫోర్స్‌ ఇన్స్‌పెక్టర్‌ షాకేర్‌ అలీ, వారి సిబ్బంది బోధన్‌ పిఎస్‌ పరిధి ...

Read More »