Breaking News

కామ్రేడ్‌ వినోద సేవలు మరువలేనివిలి

నిజామాబాద్‌, జనవరి 21

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా నవీపేట్‌లో పివోడబ్ల్యు జిల్లా కమిటి సభ్యురాలు 18వ తేదీ తెల్లవారు ఝామున హార్ట్‌ ఎటాక్‌తో మరణించిన కామ్రేడ్‌ వినోద సంతాప సభను సీపీఐ (ఎం-ఎల్‌) న్యూ డెమోక్రసీ పార్టీ బోధన్‌ డివిజన్‌ కమిటీ ఆధ్వర్యంలో నవీపేట్‌లో నిర్వహించారు. మొదట ఆమె మతికి సంతాపంగా రెండు నిముషాలు మౌనం పాటించి నివాళులు అర్పించారు.

సభలో తెలంగాణ ప్రగతి శీల బీడీ వర్కర్స్‌ యూనియన్‌ (ఐఎఫ్‌టీయూ) రాష్ట్ర అద్యక్షులు వనమాల కష్ణ, అఖిల భారత రైతు కూలీ సంఘం (ఏఐకేఏంఎస్‌) రాష్ట్ర కార్యదర్శి వి.ప్రభాకర్‌, సీపీఐ (ఎం-ఎల్‌) న్యూ డెమోక్రసీ పార్టీ బోధన్‌ డివిజన్‌ కమిటీ కార్యదర్శి కే.గంగాధర్‌, పివోడబ్ల్యు జిల్లా అద్యక్షురాలు వి.గోదావరి, యూనియన్‌ రాష్ట్ర కార్యదర్శి ఎం.నరేందర్‌ మాట్లాడారు.

కామ్రేడ్‌ వినోద ఒక మనిషిని మరో మనిషి దోపిడి చేసే వ్యవస్థ పోవాలంటు, అసమానతలు లేని నూతన సమాజం కోసం పార్టీలో హోల్‌ టైమర్‌గా బీడీ రంగంలో ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా బిక్కనూర్‌ ప్రాంతానికి వెళ్ళి పనిచేసిన, తరువాత జానకంపేట్‌లో వుండి పని చేసిన, ఆ తరువాత నవీపేట్‌కు మారిన ఎక్కడికంటె అక్కటికి తన భర్త రాజేశ్వర్‌తో వెళ్లిందని, తన కుటుంబంలో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఒడి దొడుకులు వచ్చిన తన భర్త రాజేశ్వర్‌కు తోడు, నీడగా వుండి సహకరించినదని, అట్లాగే వారి ఇంటికి వచ్చే పార్టీ, యూనియన్‌ నాయకులతో పాటు బీడీ కార్మికులు, రైతు కూలీ సంఘం నాయకులు ఎవ్వరచ్చిన అందరికీ ఎంతో ప్రేమతో నవ్వుతూ ఆప్యాయంగా మాట్లాడి నీళ్లు, చాయ్‌లు యిచ్చి, అన్నం పెట్టేదని ఆమె సేవలు మరువ లేనివని, ఆమె లేని లోటు తీరనిదని కొనియాడారు. ప్రజల కోసం పని చేస్తున్న పార్టీ, ప్రజా సంఘాల్లోని కుటుంబాలలొని మహిళలు వినోద మాదిరిగా వుండాలని పిలుపు నిచ్చారు.

కార్యక్రమంలో ఇప్టూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎం.ముత్తైన్న, డి.దాసు, బి.భూమన్న, యం.వెంకటి, రావుట్ల రమేశ్‌, కే.రవి, ఏఐకేఏంఎస్‌ జిల్లా ప్రదాన కార్యదర్శి రామకష్ణ,రాజేశ్వర్‌, రాజేందర్‌, పివోడబ్ల్యు నాయకులు సత్తెక్క, రమ, బి.నాగమణి, పాషా బేగం, వినోద ఏఐకేఏంఎస్‌ నాయకులు పి.నాగన్న, పి.రాజేశ్వర్‌, ఒడ్డెన్న, నసీర్‌, పెద్దులు, అరుణోదయ చరణ్‌, రమేశ్‌, శివాజి బీడీ నందిపేట్‌ సెంటర్‌ మేనేజర్‌, సూపర్‌ వైజర్‌ పండరి బీడీ కమిషన్‌ దారులు, వినోద కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Check Also

అభివృద్ధి సంక్షేమానికే పట్టం

బోధన్‌, మార్చ్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివ ృద్ధి సంక్షేమ ...

Comment on the article