Breaking News

భారీగా గుట్కా, జర్దా స్వాధీనం

బోధన్‌, జనవరి 20

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బోధన్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని న్యూ బస్టాండ్‌ సమీపంలో ఒక గోడౌన్‌, పోస్ట్‌ ఆఫీసు సమీపంలో రెండు హోల్‌ సెల్‌ షాపులలో గుట్క, జర్దా పట్టుకున్నట్టు నిజామాబాద్‌ టాస్క్‌ ఫోర్స్‌ పోలీసులు వెల్లడించారు. వీటి విలువ సుమారు సుమారు 5 లక్షల వరకు ఉంటుందని పేర్కొన్నారు.

బుధవారం నిజామాబాద్‌ అదనపు పోలీసు కమిషనర్‌ అరవింద బాబు ఉత్తర్వుల మేరకు టాస్క్‌ ఫోర్స్‌ ఇన్స్‌పెక్టర్‌ షాకేర్‌ అలీ, వారి సిబ్బంది బోధన్‌ పిఎస్‌ పరిధి సమీపంలోని ఒక చోట్ల అక్రమంగా గుట్కా మరియు జర్ధా వున్నదని విశ్వసనీయ సమాచారం మేరకు దాడి చేయగా సుమారు ఐదు లక్షల రూపాయల విలువ చేసే గుట్కా మరియు జర్ధా లను పట్టుకోవడం జరిగినదని నిజామాబాద్‌ అదనపు పోలీస్‌ కమిషనర్‌ అరవింద బాబు గారు తెలిపారు.

పట్టుబడిన నిందితుల వివరాలు

1, గోడౌన్‌ యజమాని, షేక్‌ అన్వర్‌

2. హోల్‌ సెల్‌ షాప్‌ యజమాని సోలాపూర్‌ రాంచందర్‌

3. హోల్‌ సెల్‌ షాప్‌ యజమాని సోలాపూర్‌ లక్ష్మన్‌

Check Also

అభివృద్ధి సంక్షేమానికే పట్టం

బోధన్‌, మార్చ్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివ ృద్ధి సంక్షేమ ...

Comment on the article